సావిత్రి బయోపిక్ లో సమంత, కీర్తి సురేష్

Wednesday,March 08,2017 - 01:15 by Z_CLU

మహిళా దినోత్సవం రోజు మహానటి సావిత్రి బయోపిక్ ని అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్స్ స్వప్న దత్, ప్రియాంక దత్. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇంకా సినిమా యూనిట్ సావిత్రి గురించి రీసెర్చ్ చేస్తూనే ఉంది.

సావిత్రి కథను రాయడానికి యూనిట్ ఎంత కష్టపడిందో.. ఈ బయోపిక్ లో క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం కోసం కూడా అంతే కష్టపడ్డారు. ఫైనల్ గా ఈ బయోపిక్ లో సావిత్రి క్యారెక్టర్ కి కీర్తి సురేష్ ని ఫిక్స్ చేసుకుంది సినిమా యూనిట్. ఇక సమంతా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ని పోషిస్తుంది. విమెన్స్ డే సందర్భంగా ఈ డీటెయిల్స్ రివీల్ చేశారు.

తెలుగు సినిమా హిస్టరీలోనే చెరగని ముద్ర వేశారు సాావిత్రి. అలాంటి మహానటి బయోపిక్ వివరాల్ని ఉమెన్స్ డే రోజున అనౌన్స్ చేయడం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న సినిమా యూనిట్, రైట్ టైం చూసుకుని సినిమాని సెట్స్ పైకి తీసుకుని వచ్చే ఆలోచనలో ఉంది.