

Thursday,June 01,2023 - 05:26 by Z_CLU
భోళా మానియా జూన్ 4న విడుదలయ్యే మొదటి సింగిల్ తో ప్రారంభమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి అల్ట్రా-మోడిష్ అవతార్ లో స్టైలిష్ పోస్టర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేసినట్లు రేపు పాట ప్రోమోను విడుదల చేయనున్నారు. చిరు స్పోర్ట్స్ షేడ్స్ తో స్టార్ చిహ్నాలు ఉన్న ఆకుపచ్చ చొక్కా ధరించి, త్రిశూల్ ఆకారంలో చైన్ ని తిప్పుతూ కనిపించారు.
తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నారు.
డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Thursday,September 14,2023 02:58 by Z_CLU
Monday,September 04,2023 01:03 by Z_CLU
Tuesday,August 22,2023 04:03 by Z_CLU
Tuesday,August 22,2023 04:02 by Z_CLU