సాహో లో ఆ హీరోయిన్ ఫిక్స్

Sunday,June 04,2017 - 12:00 by Z_CLU

‘బాహుబలి’ తో ఇంటర్నేషనల్ స్టార్ గా గుర్తింపు అందుకున్న ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘సాహో’ తో త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజీ కి చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు మేకర్స్. టీజర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇప్పటికే కొంత మంది హీరోయిన్స్ పేర్లు వినిపించగా లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో పూజ హెగ్డే పేరు కూడా చేరింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తాజాగా ఈ పూజా ని ఈ సినిమాకు ఫైనల్ చేసేశారట మేకర్స్. హ్రితిక్ రోషన్ నటించిన ‘మొహంజదారో’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రెజెంట్ అల్లు అర్జున్ తో ‘డీజే’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఓ మోస్తరు క్రేజ్ సంపాదించుకోవడంతో ఈ భామను సాహో లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. త్వరలోనే మేకర్స్ ఈ విషయాన్నీ అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్లు సమాచారం.