రేపే ‘మహానటి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

Thursday,April 19,2018 - 01:45 by Z_CLU

రేపు ‘మహానటి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ కి  సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు రేపు రిలీజ్ కాబోయే ఈ టీజర్ ఫ్యాన్స్  ని మెస్మరైజ్ చేయడం గ్యారంటీ అనిపిస్తుంది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో ఉండబోయే ఈ రొమాంటిక్ సాంగ్ ‘మూగ మనసులు’ సినిమాపై భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేయనుంది.

సీనియర్ నటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా సర్ ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. సావిత్రి లైఫ్ లోని పర్సనల్ లైఫ్ ఎలిమెంట్స్ తో పాటు, సినిమా కరియర్ లో ఆమె వైభవాన్ని కళ్ళకు కట్టేటట్టు సినిమాను ప్లాన్ చేసుకున్నారు ఫిల్మ్ మేకర్స్.

మిక్కీ.జె. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో సమంతా కీ రోల్ ప్లే చేస్తుంది. స్వప్నదత్, ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ జెమినీ గణేషన్ రోల్ లో కనిపించనున్నాడు.