టాలీవుడ్ నాకు సెకండ్ హోమ్ – కైరా అద్వానీ

Thursday,April 19,2018 - 01:14 by Z_CLU

మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది బాలీవుడ్ భామ కైరా అద్వానీ. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో ట్విట్టర్ లో చాలా విషయాలు షేర్ చేసుకుంది. తన స్కూల్ డే నుండి బిగిన్ అయితే టాలీవుడ్ కరియర్ వరకు ఫ్యాన్స్ అడిగే క్వశ్చన్స్ కి ఓపిగ్గా సమాధానాలు చెప్పింది.

ముంబై లోని ద కేథరల్ అండ్ జాన్ స్కూల్ లో చదువుకున్న కైరా, చిన్నప్పటి నుండి ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయమట. ఇక ‘భరత్ అనే నేను’ షూటింగ్ టైమ్ లో తిన్న హైదరాబాద్ బిర్యానీ చాలా నచ్చేసింది అని చెప్పుకున్న కైరా, ఇక్కడ దోస కూడా చాలా టేస్టీగా ఉంటుందని ఎగ్జైటెడ్ గా చెప్పుకుంది. టాలీవుడ్ లో నటించాలని పర్టికులర్ గా ప్లాన్ చేసుకోలేదని చెప్తున్న కైరా, ఒక్క సినిమాతోనే టాలీవుడ్ తనకు సెకండ్ హోమ్ అనిపించేంతలా నచ్చేసిందని చెప్తుంది.

‘భరత్ అనే నేను’ తరవాత రామ్ చరణ్ – బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కైరా,కరియర్ బిగినింగ్ లోనే టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ తో   స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ దొరికినందుకు లక్కీగా ఫీలవుతున్నానని చెప్పుకుంది. ఈ నెల 21 నుండి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది కైరా. ఇప్పటికే రిలీజైన ‘భరత్ అనే నేను’ సాంగ్స్ ప్రోమోస్ కి వస్తున్న రెస్పాన్స్, టాలీవుడ్ టాప్ మోస్ట్ స్టార్స్ కైరాకి ఇస్తున్న ప్రిఫరెన్స్ చూస్తుంటే, హీరోయిన్స్  టాప్ లిస్టులో చేరడానికి పెద్దగా టైమ్ పట్టదనిపిస్తుంది.