కీర్తి సురేష్ కి కూడా తప్పలేదు

Tuesday,June 20,2017 - 01:03 by Z_CLU

కొన్ని సినిమాలు ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేయవు, ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తాయి. ఇక స్టార్స్ విషయానికి వస్తే కొన్ని సినిమాలు చేసే అవకాశం రావడమే అదృష్టంగా ఫీల్ అవుతారు. ఇక ఆ ఛాన్స్ దక్కాక ఆ క్యారెక్టర్ కోసం ఎన్ని తంటాలుపడాల్సి  వచ్చినా లెక్క చేయరు. ఇప్పుడు కీర్తి సురేష్ ఎగ్జాక్ట్ గా అదే సిచ్యువేషన్ లో ఉంది.

మహానటి సావిత్రి సినిమాలో గోల్డెన్ చాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్, ఇప్పుడా సినిమా కోసం వెయిట్ పెంచేస్తుందట. సావిత్రి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి గారి లైఫ్ లోని కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ని హైలెట్ చేసే ప్రయత్నం చేస్తుంది సినిమా యూనిట్. వాటికి తగ్గట్టు కీర్తి సురేష్ కూడా ఈ క్యారెక్టర్ కోసం డేడికేటెడ్ గా ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది.

 

ఈ సినిమాలో జెమినీ గణేషన్ క్యారెక్టర్ లో దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా, సమంతా కీ రోల్ ప్లే చేస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్వప్న దత్, ప్రియాంక దత్ కలిసి నిర్మిస్తున్నారు.