పవన్ కళ్యాణ్ సినిమాలో వెంకటేష్

Tuesday,June 20,2017 - 03:22 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో లేటెస్ట్ గా ఓ స్పెషల్ ఎలిమెంట్ చోటు చేసుకుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడట. వెంకటేశ్ పై ఇప్పటికే కొన్ని సన్నివేశాలు కూడా పిక్చరైజ్ చేశారని టాక్.

పవన్-వెంకీ బెస్ట్ ఫ్రెండ్స్. టైం దొరికితే ఆధ్యాత్మిక, తాత్విక విషయాల గురించి సుదీర్ఘంగా చర్చించుకుంటారు ఈ ఇద్దరు స్టార్లు. ఇక సినిమాల విషయానికొస్తే.. వీరిద్దరి కాంబినేషన్ లో ‘గోపాల గోపాల’ సినిమా తెరకెక్కింది. కేవలం వెంకటేష్ కోసమే ఈ సినిమా చేశానని గతంలో పవన్ ప్రకటించాడు.

ఇప్పుడు పవన్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం వెంకటేశ్ ను సంప్రదించారట. క్యారెక్టర్ నచ్చడంతో పాటు పవన్ సినిమా కావడంతో చేయడానికి ఒప్పుకున్నాడట వెంకీ. విక్టరీ వెంకటేశ్ సినిమాలకు పనిచేసిన అనుభవం త్రివిక్రమ్ కు ఉంది. ఆ అనుభవంతో తనదైన స్టయిల్ లో వెంకీ కోసం కొన్ని బలమైన సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగులు రాశాడట త్రివిక్రమ్. త్వరలోనే ఈ మేటర్ పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.