బాలీవుడ్ పార్టీలో మెరిసిన ప్రభాస్

Tuesday,June 20,2017 - 12:01 by Z_CLU

కేవలం ప్రభాస్ కోసమే దర్శక-నిర్మాత కరణ్ జోహార్ పెద్ద పార్టీ ఇచ్చాడు. బాహుబలి-2 విడుదలైన వెంటనే అమెరికా వెళ్లిపోయాడు ప్రభాస్. మళ్లీ ఇన్ని రోజులకు తిరిగొచ్చాడు. ప్రభాస్ వచ్చిన వెంటనే అతడి కోసం ముంబయిలో పెద్ద పార్టీ ఇచ్చాడు కరణ్ జోహార్.

బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల్ని హిందీలో ప్రజెంట్ చేసింది కరణ్ జోహార్ అనే విషయం తెలిసిందే. ఈ ఫ్రాంచేజీతో కరణ్ బాగానే లాభాలు ఆర్జించాడు. అందుకే తన బ్యాచ్ మొత్తాన్ని పిలిచి ప్రభాస్ కు పెద్ద పార్టీ ఇచ్చాడు. భళ్లాలదేవ రానా కూడా ఈ పార్టీకి హాజరయ్యాడు.

పార్టీలో ప్రభాస్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. చాలామంది బాలీవుడ్ హీరోలు ప్రభాస్ తో సెల్ఫీలు దిగారు. సరదా స్కిట్స్ చేశారు. స్టార్ హీరో రణబీర్ కపూర్ తో పాటు వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, అలియాభట్ లాంటి తారలు ఈ పార్టీకి హాజరయ్యారు.