కీర్తి సురేష్ ఇంటర్వ్యూ

Tuesday,February 06,2018 - 05:35 by Z_CLU

టాలీవుడ్ లో ‘నేను శైలజ’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన కీర్తి సురేష్, ఆ తరవాత నేను లోకల్, రీసెంట్ గా అజ్ఞాతవాసి సినిమాలోను మెస్మరైజ్ చేసింది. షార్ట్ పీరియడ్ లో స్టార్ హీరోయిన్ రేస్ లో చేరిన కీర్తి సురేష్, ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘మహానటి’ సినిమాతో బిజీగా ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ గురించి చాలా విషయాలు షేర్ చేసుకుంది కీర్తి సురేష్. అవి మీకోసం… 

సక్సెస్ కి రీజన్….

నేను నా కరియర్ ని పెద్దగా ప్లాన్ చేయలేదు. ఫ్లో తో పాటే వెళ్తున్నాను. కాకపోతే లక్కీగా ఏ సినిమా చేసినా సక్సెస్ అవ్వడం నాకు పెద్ద ఎసెట్ అయింది. అంతకుమించి కారణాలు లేవు. అలా కాదని ఇప్పుడు కారణాలు వెదుక్కునే ప్రయత్నం చేస్తే లైఫ్ లో ప్రెజర్ పెరిగిపోతుంది. అయినా నా కరియర్ ని అనలైజ్ చేసేంత అనుభవం నాకింకా రాలేదు.

 

 

అప్పటి వరకు హెక్టిక్ అనిపించినా….

నాకు బిజీగా ఉండటం అంటే ఇష్టమే కానీ ఆ మధ్య మహానటి, భైరవ, నేను లోకల్, అజ్ఞాతవాసి సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి రావడంతో ఒక్కసారిగా 4 సినిమాలు… హెక్టిక్ అనిపించేది. కనీసం రెస్ట్ తీసుకోవడానికి కూడా టైమ్ దొరికేది కాదు. కానీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక అవుట్ పుట్ చూసుకుంటే చాలా హ్యాప్పీ…

మహానటి సావిత్రి సినిమా….

ఈ సినిమా గురించి చెప్పినప్పుడు అంత ఎగ్జైట్ మెంట్ లేదు. సినిమా సావిత్రి గారి లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ ఫేజ్ ని ఎలివేట్ చేస్తుందని తెలిసినా, ప్రెజెంటేషన్ విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. కానీ నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ ప్లాన్ చేసుకున్న తీరు విన్నాక అమేజింగ్ అనిపించింది. నిజం చెప్పాలంటే అదృష్టం కలిసొచ్చింది కాబట్టే నాకీ అవకాశం వచ్చింది.

నాగ్ అశ్విన్ గురించి…

డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి ఇది జస్ట్ 2 వ సినిమా… అసలు ఇంత ప్రెస్టీజియస్ సినిమాని నిజంగా తను హ్యాండిల్ చేయగలడా అనే క్వశ్చన్ రేజ్ అయినప్పుడు నటిగా నాకున్న ఎక్స్ పీరియన్స్ కూడా తక్కువే కదా అనిపించింది. నాగ్ అశ్విన్ ఈ స్టోరీని 3 గంటల పాటు న్యారేట్ చేశాడు. తను న్యారేట్ చేస్తున్నంత సేపు కంప్లీట్ గా స్టోరీకి కనెక్ట్  అయిపోయాను…

అదే డిఫెరెన్స్…

మహానటి స్టోరీ మొత్తం సమంతా పాయింట్ ఆఫ్ వ్యూ లో నటిస్తుంది. సమంతా ఈ సినిమాలో జర్నలిస్ట్ గా నటిస్తుంది. అన్ని సినిమాల్లోలాగే ఈ సినిమాలో కూడా డ్రామా, హ్యూమర్, ట్రాజెడీ లాంటి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకే ఈ సినిమా జస్ట్ బయోపిక్ కాదు అంతకు మించి…

చాలా రూమర్స్ వచ్చాయి…

ఈ సినిమా సెట్స్ పైకి వచ్చిన తరవాత నేను ఈ సినిమా కోసం బరువు పెరుగుతున్నానని రూమర్స్ వచ్చాయి. నిజం చెప్పాలంటే నేను బరువు పెరగలేదు. సావిత్రి గారి యంగ్ ఏజ్ లో ఉండే సీక్వెన్సెస్ కోసం బరువు తగ్గాను. ఇక ఓల్డ్ ఏజ్ సీక్వెన్సెస్ కోసం ప్రొస్థెటిక్ వాడాం. అయినా సినిమాలో ఇవి కాకుండా మెస్మరైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి.

ఇంపాసిబుల్ అనిపించింది…

అశ్విన్ నేను ప్రిపేర్ అవ్వడానికి సావిత్రి గారి కొన్ని వీడియో క్లిప్స్ ఇచ్చాడు. సాధారణంగా ఏదైనా చేసేటప్పుడు చాలా ఈజ్ ఉంటుంది. మనకు నచ్చినట్టు చేస్తాం, డైరెక్టర్ కి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఎక్స్ ప్లేన్ చేస్తారు. కానీ ఇక్కడ నేను లెజెండ్రీ యాక్ట్రెస్ సావిత్రి గారిలా నటించాలి. ఆ ఆలోచనకే కంగారు పుట్టేది. అల్టిమేట్ గా నాకు అర్థమయింది ఏమిటంటే ఆవిడలా ఎవరూ నటించలేరు…

అప్పుడే ఆడియెన్స్ బోర్ ఫీల్ అవ్వరు…

నేను సినిమాను సినిమాలా చూడ్డానికే ఇష్టపడతాను. కమర్షియల్ సినిమా అయినా ఫీమేల్ సెంట్రిక్ సినిమా అయినా నాకు పెద్ద డిఫెరెన్స్ అనిపించదు. అయినా ఇలా డిఫెరెంట్ గా చేస్తుంటేనే ఆడియెన్స్ బోర్ గా ఫీల్ అవ్వరు.

మహానటి సో స్పెషల్…

కరియర్ విషయంలో చాలా హ్యాప్పీగా ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే నేను అనుకున్న దానికన్నా స్పీడ్ గా జరిగిపోయాయి. అయినా ఈ సినిమాలన్నింటి కన్నా మహానటి నాకు చాలా స్పెషల్. నా కరియర్ లో ఇది చాలా పెద్ద వెంచర్. సాధారణంగా ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కి 30 రకాల కాస్ట్యూమ్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో 120 రకాల కాస్ట్యూమ్స్ వాడుతున్నారు. అద్భుతంగా తెరకెక్కుతుంది సినిమా.