రష్యా కుర్రాడితో శ్రియ పెళ్లి?

Tuesday,February 06,2018 - 06:11 by Z_CLU

సౌతిండియా స్టార్ హీరోయిన్ శ్రియ పెళ్లిపై మళ్లీ పుకార్లు షురూ అయ్యాయి. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వస్తున్నాయి. గమ్మత్తుగా ఈసారి బాలీవుడ్ మీడియా నుంచి ఈ టైపు స్టోరీలు వస్తున్నాయి.

కొన్నేళ్లుగా ఓ రష్యన్ యువకుడితో రిలేషన్ షిప్ లో ఉందట శ్రియ. త్వరలోనే అతడ్ని పెళ్లాడనుందట. తన బాయ్ ఫ్రెండ్ ఫ్యామిలీని కలవడానికి రష్యా కూడా వెళ్ళిందనే టాక్  గట్టిగా వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చిలోనే శ్రియ పెళ్లి అనేది తాజా పుకారు.

 

35 ఏళ్ల శ్రియపై ఇలా పెళ్లి పుకార్లు రావడం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో ఓ క్రికెటర్ తో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు రష్యా కుర్రాడితో పెళ్లంటూ కథనాలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతానికైతే వీటిపై శ్రియ స్పందించలేదు. తెలుగులో గాయత్రి, వీరభోగ వసంతరాయలు సినిమాల్లో నటిస్తోంది శ్రియ.