షూటింగ్ అప్ డేట్స్

Tuesday,February 06,2018 - 04:48 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ స్టార్ మూవీస్ ప్రస్తుతం షూటింగ్ ప్రాసెస్ లో ఉన్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాల లేటెస్ట్ స్టేటస్ ఇదే…

భరత్ అనే నేను :

మహేష్ బాబు – కొరటాలశివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు యూనిట్. ఈ షెడ్యుల్ తర్వాత ఫారిన్ లో మరో షెడ్యుల్ జరుపుకోనుంది. మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

రంగస్థలం :

రంగస్థలం సాంగ్  షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. ఇదొక ఐటెంసాంగ్. రామ్ చరణ్, పూజా హెగ్డే మధ్య ఈ మసాలా సాంగ్ ను షూట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఇది తెరకెక్కుతోంది. మరో 2 రోజుల పాటు ఈ సాంగ్ షూట్ జరగనుంది. ఈ సాంగ్ తర్వాత మరో 10 రోజుల ప్యాచ్ వర్క్ ఉంటుంది.

నా పేరు సూర్య :

వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘నా పేరు సూర్య’ ప్రస్తుతం కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. కాశ్మీర్ బోర్డర్ లో కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్న యూనిట్ అనంతరం శ్రీనగర్ లో సాంగ్ షూట్ చేయనున్నారు. రామ లక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన అను ఎమ్మనుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది.

నా నువ్వే :

కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా నటిస్తున్న ‘నా నువ్వే’ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరుగుతుంది. జయంత్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్.

లవర్ :

రాజ్ తరుణ్, దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లవర్. అనీష్ కృష్ణ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నల్గొండలో జరుగుతోంది. ఇంతకుముందు అలా ఎలా అనే సినిమా తీశాడు అనీష్ కృష్ణ.

శర్వానంద్ కొత్త సినిమా :

శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం కోల్ కతాలో జరుగుతోంది. ఇది 20 రోజుల షెడ్యూల్. ఈ షెడ్యూల్ తర్వాత నేపాల్ లో ఓ భారీ షెడ్యూల్ మొదలవుతుంది.

సవ్యసాచి :

నాగ చైతన్య, చందూ మొండేటి సవ్యసాచి రెండో షెడ్యుల్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. హైదరాబాద్ షెడ్యుల్ పూర్తయిన తర్వాత విదేశాల్లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్.

నేలటికెట్ :

రవితేజ, కళ్యాణ్ కృష్ణ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. మేజర్ పార్ట్ షూటింగ్ వైజాగ్ లోనే ఉంటుంది. ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ మొదలవుతుంది.

శైలజారెడ్డి అల్లుడు :

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో నడుస్తోంది. రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.


సుమంత్ కొత్త సినిమా :

సుమంత్ నటిస్తున్న క్రైం థ్రిల్లర్ సినిమా ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాతో అనిల్ దర్శకుడిగా పరిచయం అవునున్నాడు. మూవీ టైటిల్ తో పాటు మరిన్ని వివరాలతో ఈనెలాఖరుకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు.