అసలైన సీక్వెల్స్ అంటే ఇవే!

Saturday,June 08,2019 - 12:04 by Z_CLU

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘మన్మధుడు 2’ గతంలో వచ్చిన ‘మన్మధుడు’ కి సీక్వెల్ కాదు. అంతెందుకు అంజలి నటిస్తున్న ‘గీతాంజలి’ కూడా సీక్వెల్ కాదు. జస్ట్ సక్సెస్ ఫుల్ సినిమా టైటిల్ పక్కన నంబర్ చేరిందంతే. కానీ ఈ సినిమాలతో పాటు అసలు సిసలైన సీక్వెల్స్ తెరకెక్కడానికి రెడీ అవుతున్నాయి.

నిఖిల్ ‘కార్తికేయ 2’ రేపో మాపో సెట్స్ పైకి రావడానికి రెడీ అవుతుంది. అయితే ‘కార్తికేయ’ లో కథ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుండే సినిమా బిగిన్ కాబోతుంది. ఈసారి మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అడివి శేష్ ‘గూఢచారి 2’ కూడా అంతే. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కొత్త మిషన్ స్టార్ట్ చేస్తాడు హీరో. కట్ చేస్తే మంచు కొండల మధ్య ఫారిన్ లొకేషన్ లో కనిపిస్తాడు. అక్కడే ఈ కథ మొదలుకాబోతుంది. ఆ మిషన్ చుట్టే సినిమా తెరకెక్కబోతుంది.

గతంలో సక్సెస్ ఫుల్ అనిపించుకున్న ఈ సినిమాల సీక్వెల్స్ ని అంతకు మించిన స్టాండర్డ్స్ తో తెరకెక్కించనున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ అసలు సిసలైన సీక్వెల్స్ కి ఆడియెన్స్ లో భారీ డిమాండ్ ఉంది.