నివేత పేతురాజ్ – మరో కీలక పాత్రతో మెప్పిస్తుందా?

Saturday,June 08,2019 - 01:04 by Z_CLU

రీసెంట్ గా ‘చిత్రలహరి’ సినిమాలో నటించింది నివేత పేతురాజ్. ఓ రకంగా చెప్పాలంటే హీరోయిన్ రోల్ కన్నా నివేత ప్లే చేసిన రోల్ సినిమాకి చాలా కీలకం. అంతెందుకు డెబ్యూ మూవీ ‘’మెంటల్ మదిలో కూడా నివేత హీరోకి సమానంగా ఉన్న హీరోయిన్ రోల్ నే ఎంచుకుంది. మరి ఇప్పుడు బన్ని సినిమాలో కూడా ఆ స్థాయి పాత్ర ఉంటుందా…?

సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ గురించి సినిమా చూడకుండా ఓ డెసిషన్ కి రాలేము. ఒక్కోసారి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే రోల్ రాసుకుంటాడు. అప్పుడప్పుడు సెకండ్ హీరోయిన్ ని జస్ట్ సాంగ్స్ కే పరిమితం చేస్తాడు… మరి బన్ని సినిమాలో ఏం చేయబోతున్నాడన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే…

జస్ట్ గ్లామర్ రోల్ అయితే నిజానికి నివేత అవసరం లేదు. అలాంటి పాత్రే అయితే నివేత కాకుండా చాలామంది హీరోయిన్స్ ని కన్సిడర్ చేయొచ్చు. పనిపడగా త్రివిక్రమ్ నివేతను ఎంచుకున్నాడంటే, కొద్దో గొప్పో బరువు ఉన్న పాత్రే అయి ఉంటుందన్న అభిప్రాయమైతే వినిపిస్తుంది.

చూడాలి మరీ… బన్ని సినిమా కదా కాసేపు కనిపించినా చాలు అని సంతకం చేసేసిందా నివేత..? లేకపోతే లెక్కప్రకారం తన ఇమేజ్ కి తగ్గ రోల్ అనుకునే ఫిక్సయిందా…? ఇంకొన్ని రోజులు ఆగితే కానీ విషయం బయటికి రాదు.