అల్లరోడ్ని ఫాలో అవుతున్న అక్కినేని హీరో

Saturday,June 08,2019 - 11:03 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడుతున్న సమయంలో ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్నాడు అల్లరి నరేష్. స్పెషల్ రోల్స్ చేయడం ఈ అల్లరోడికి కొత్త కాదు కానీ, సొంత సినిమాలను పక్కన పెట్టి మరీ ‘మహర్షి’ లో స్పెషల్ రోల్ చేశాడు. దాంతో ప్లాన్ వర్కవుట్ అయింది. అల్లరి నరేష్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. ఇప్పుడిదే ఫార్ములాని పాటిస్తున్నాడు అక్కినేని హీరో సుశాంత్.

రీసెంట్ గా చి.ల.సౌ. తో హిట్ అందుకున్నాడు  సుశాంత్. కానీ అవకాశాలే ఇంకా స్పీడందుకోలేదు. కథలు వింటున్నట్టు తెలుస్తుంది కానీ, ఈసారి ఆలస్యమైనా పర్వాలేదు కానీ తొందరపడకూడదని ఫిక్సయి ఉన్నాడు. ఈ లోపు అల్లరోడి ఫార్ములాకే ఓటేశాడు. అల్లరి నరేష్ ‘మహర్షి’ ని ఎంచుకున్నట్టు సుశాంత్ బన్ని సినిమాకి ఫిక్సయ్యాడు. స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు.

ఈ సినిమాలో సుశాంత్ ప్లే చేస్తున్న క్యారెక్టర్ ఎలా ఉండబోతుందన్నది అప్పుడే గెస్ చేయడం కష్టం కానీ, ఈ సినిమాతో చిన్నగా కమర్షియల్ ట్రాక్ లో పడొచ్చనే ఆలోచనలో ఉన్నాడు సుశాంత్.

దీని బట్టి చూస్తే బన్ని సినిమా రిలీజ్ అయిన తరవాతే నెక్స్ట్ సినిమా గురించి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు సుశాంత్. చూడాలి మరీ ‘మహర్షి’ అల్లరి నరేష్ కి కలిసొచ్చినట్టు, బన్ని సినిమా సుశాంత్ కి ఏ స్థాయిలో కలిసొస్తుందో చూడాలి…