Karthikeya 2 - నిఖిల్ సినిమాకు టైటిల్ మారుతోందా?

Friday,July 16,2021 - 03:31 by Z_CLU

హీరో నిఖిల్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి ‘కార్తికేయ 2′ కాగా మరొకటి ’18 పేజెస్’. ఈ రెండు సినిమాలు షూటింగ్ స్టేజిలో ఉన్నాయి. 18 పేజెస్ కి సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయింది. కొంత షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ‘కార్తికేయ 2’ కి సంబంధించి రెండు మూడు షెడ్యుల్స్ జరిగాయి. వచ్చే వారం నుండి మరో షెడ్యుల్ మొదలు కానుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సినిమాకు ‘కార్తికేయ 2’ కాకుండా దైవం మనుష్య రూపేణా అనే టైటిల్ పెట్టబోతున్నరనే ప్రచారం జరుగుతుంది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తుంది అవును సినిమాకు కార్తికేయ 2 టైటిల్ నే ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. కార్తికేయ బ్రాండ్ మీదే అదే టైటిల్ తో ఓ సీక్వెల్ రాసుకొని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసుకున్నాడు చందూ మొండేటి. అలాంటప్పుడు ఆ టైటిల్ ఎలా మారుస్తారు ?

మేకర్స్ దైవం మనుష్య రూపేణా కూడా సినిమాకు పెట్టనున్నారు. అయితే అది టైటిల్ కాదట. కార్తికేయ 2 కింద క్యాప్షన్ గా వాడబోతున్నారట. ఇక క్యాప్షన్ నే టైటిల్ గా పెట్టారని భావించి సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ పై చర్చ నడుస్తుంది. త్వరలోనే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నారు మేకర్స్. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ పై విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics