నిఖిల్ హీరోగా 'కార్తికేయ-2'.. త్వరలోనే సెట్స్ పైకి

Saturday,June 01,2019 - 12:36 by Z_CLU

2014లో నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ’ పెద్ద హిట్ అయింది. అప్పటి నుంచే ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ – 2 ‘ వస్తుందంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికది నిజమవుతోంది.

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ పేరుతో రూపొందనున్న ఈ సీక్వెల్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తారు. ఈరోజు నిఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

‘కార్తికేయ’ కు కొనసాగింపుగా ‘కార్తికేయ-2 ‘ ఉంటూనే కథ, స్క్రీన్ ప్లే విషయాల్లో సరికొత్తగా ఉంటుందని… ఓ రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ సీక్వెల్ అవుతుందని అంటున్నాడు దర్శకుడు. సినిమా సెట్స్ పైకి వచ్చిన వెంటనే నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు వెల్లడిస్తారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి