Karthikeya 2 థియేటర్ కోసం తీసిన సినిమా

Wednesday,August 03,2022 - 07:41 by Z_CLU

Hero Nikhil Siddharth Speech at Karthikeya 2 PressMeet

నిఖిల్ సిద్దార్థ్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కార్తికేయ 2’ ఆగస్ట్ 13 న గ్రాండ్ గా రిలీజవుతోంది. ఈ సందర్భంగా టీం మీడియా ముందుకొచ్చి కొత్త ట్రైలర్ విశేషాలు అలాగే సినిమా సంగతులు పంచుకున్నారు.

హీరో నిఖిల్ మాట్లాడుతూ “ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రెండు పాండమిక్ లను దాటి ఈ సినిమాను కంప్లీట్ చేశాం. మా నిర్మాతలు నాకు మా దర్శకుడికి బెస్ట్ సపోర్ట్ అందించి సినిమాను ముందుకు నడిపించారు. ఆడియన్స్ నుండి ఈ సినిమాకు మంచి సపోర్ట్ లభిస్తుంది. థియేటర్స్ కోసమే తీసిన సినిమా ఇది.  లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ , గ్రాఫిక్స్ , గ్రాండియర్ విజువల్స్ ఇలా థియేటర్స్ లో ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఎంతో కష్టపడి బెస్ట్ లోకేషన్స్ లో షూట్ చేసుకొని వచ్చాం.  సినిమా బాగా వచ్చింది. అందరికీ నచ్చే ఫిలిం అవుతుంది.  ఆగస్ట్ 6న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. ఫస్ట్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు రిలీజ్ అవ్వబోయే ట్రైలర్ కూడా దానికి మించి ఉంటుంది. ” అన్నారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics