‘మణికర్ణిక’ కోసం కంగనా రనౌత్ పడ్డ కష్టం

Saturday,January 05,2019 - 11:02 by Z_CLU

నిన్న రిలీజైంది ‘మణికర్ణిక’ ట్రైలర్. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుండి ఈ సినిమా చుట్టూ ఎన్ని వైబ్స్ క్రియేట్ అయినా, కంగనా రనౌత్ ఏ స్థాయిలో పర్ఫామ్ చేసిందనేది మాత్రం ఈ ట్రైలర్ చూశాకే అర్థమయింది. మరీ ముఖ్యంగా అతి కష్టమైన స్టంట్స్  చేస్తున్నప్పుడు  కూడా ఏ మాత్రం బెదురు  లేకుండా  కనిపిస్తున్న కంగనా,  ఈ సినిమా     కోసం చాలా కష్టపడింది. రీసెంట్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ఆ విషయాన్ని రివీల్ చేసింది.

“సినిమాలో స్టంట్స్ కోసం దాదాపు నెలరోజుల టఫ్ ట్రైనింగ్ తీసుకున్నా. మరీ ముఖ్యంగా ‘కత్తి సాము’ కోసం మొదట్లో ఒక కత్తితో, అది కొంచెం పర్ఫెక్ట్ అయ్యాను అనుకున్నాక, 2 కత్తులతో… ఇలా ఒక్కో స్టేజ్ లో, స్టాండర్డ్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్లాం.” అని చెప్పుకుంది కంగనా. మరీ ముఖ్యంగా సెట్స్ లో ఆక్సిడెంట్ తరవాత ఎంత అప్రమత్తంగా ఉండాలన్నది అర్థమయింది అని చెప్పుకున్న కంగనా, ఈ సినిమా చేసినందుకు గర్విస్తున్నా”. అని చెప్పుకుంది.

శంకర్-ఎహసాన్-లాయ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. జీ స్టూడియోస్కమాల్ జైన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. జనవరి 25 న గ్రాండ్ గా రిలీజవుతుంది మణికర్ణిక.