నేనే చెర్రీ మోస్ట్ ఫేవరేట్ కో స్టార్ – కైరా అద్వానీ

Saturday,January 05,2019 - 12:03 by Z_CLU

‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన కైరా అద్వానీ, ఆ సినిమా సెట్స్ పై ఉండగానే చెర్రీ సరసన ‘వినయ విధేయ రామ’ లో చాన్స్ కొట్టేసింది. అయితే రీసెంట్ గా మీడియాతో జరిగిన ఒక  ఇంటరాక్షన్ లో చెర్రీ కి  ‘నేనే మోస్ట్ ఫేవరేట్ కో స్టార్’ అని చెప్పుకుంది.

నిజానికి ఈ మాట కైరా డైరెక్ట్ గా అనలేదు. రీసెంట్ గా ‘వినయ విధేయ రామ’  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెర్రీ, కైరా గురించి మాట్లాడుతూ, ‘కైరా నా ఫేవరేట్ కో స్టార్’ అని చెప్పుకున్నాడట. ఆ విషయాన్ని మరోసారి మీడియాతో షేర్ చేసుకుంది కైరా అద్వానీ. చెర్రీ తన గురించి అంత పాజిటివ్ గా మాట్లాడటం మరింత ఎనర్జీనిస్తుందని చెప్పుకుంది.

జస్ట్ ఒక్క లాంగ్వేజ్ ఆడియెన్స్ కే పరిమితం కాకుండా, వరల్డ్ వైడ్ గా తనకంటూ గుర్తింపు ఉండాలనేదే తన ప్రయత్నం అని చెప్పుకున్న కైరా, ‘వినయ విధేయ రామ’ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అటు బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’ లోను నటిస్తుంది కైరా.