జీ సినిమాలు ( 24th జూన్ )

Sunday,June 23,2019 - 10:02 by Z_CLU

లక్కున్నోడు

నటీనటులు : విష్ణు మంచు, హన్సిక మోత్వాని

ఇతర నటీనటులు : రఘుబాబు, జయప్రకాష్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ : రాజ కిరణ్

ప్రొడ్యూసర్ : M.V.V. సత్య నారాయణ

రిలీజ్ డేట్ : జనవరి 26, 2017

చిన్నతనం నుంచి లక్ వెంట తెచ్చి అంతలోనే లక్ ను దూరం చేసే లక్కీ(విష్ణు) ని అన్ లక్కీ గా భావించి దూరం పెడతాడు లక్కీ తండ్రి భక్త వత్సల. ఇక ఉద్యోగ అవకాశం కోసం హైదరాబాద్ వచ్చిన లక్కీ కి పాజిటీవ్ గా ఆలోచించే పద్మ(హన్సిక ) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే పద్మ ను చూసి ప్రేమలో పడిన లక్కీ, పద్మ ను ఎలా దక్కించుకున్నాడు? ఈ క్రమంలో తన అన్ లక్ కి కారణమైన జె.కె(ఎం.వి.వి.సత్యనారాయణ)ను ఎలా ఎదుర్కున్నాడు? చివరిగా 25 ఏళ్ళు దూరమైన తన తండ్రికి మళ్ళీ ఎలా దగ్గరయ్యాడు? అనేది సినిమా కథాంశం.

============================================================================

మణికర్ణిక

నటీనటులు : కంగనా రనౌత్, మొహమ్మద్ జీషన్ అయ్యుబ్

ఇతర నటీనటులు : అతుల్ కులకర్ణి, జీషు సేన్ గుప్తా, రిచర్డ్ కీప్, సురేష్ ఒబెరాయ్, డానీ డెన్ జోంగ్ పా, అంకిత లోఖాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్ – ఎహసాన్- లాయ్

డైరెక్టర్ : క్రిష్

ప్రొడ్యూసర్ : జీ స్టూడియోస్, కమాల్ జైన్, నిశాంత్ పిట్టి

రిలీజ్ డేట్ : 25 జనవరి 2019

మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా మణికర్ణిక. ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటీషు వారి బారిన పడకుండా లక్ష్మీ బాయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? తన ప్రజలను కలుపుకుని వారిపై ఎలా తిరగబడింది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. యుద్ధ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి.

============================================================================

శైలజా రెడ్డి అల్లుడు
నటీనటులు : నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యువెల్
ఇతర నటీనటులు : రమ్య కృష్ణన్, నరేష్, మురళీ శర్మ, కళ్యాణి నటరాజన్, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్
డైరెక్టర్ : మారుతి దాసరి
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 2018
ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అయిన పెద్ద వ్యాపారవేత్త (మురళి శర్మ) ఏకైక కొడుకు చైతు(నాగచైతన్య). తన తండ్రిలా కాకుండా కాస్త సహనం, ఓపికతో జీవితాన్ని కూల్ గా గడుపుతుంటాడు. ఓ సందర్భంలో చైతూకి ఈగో కు మారుపేరైన అను(అను ఇమ్మానియేల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అలా తండ్రి , ప్రియురాలి ఈగోల మధ్య నలిగిపోయే చైతూ జీవితంలోకి అనుకోకుండా పౌరుషంతో గల ఈగో ఉన్న మరో వ్యక్తి వస్తుంది.. ఆవిడే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ).
తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడం కోసం స్నేహితుడు చారి(వెన్నెల కిషోర్)తో కలిసి అత్తయ్య శైలజారెడ్డి ఇంట్లో అడుగుపెడతాడు చైతూ. మామయ్య సహకారంతో తల్లికూతురుని చైతూ ఎలా కలిపాడు, వాళ్ల ఇగోల్ని ఎలా జయించాడు అనేది బ్యాలెన్స్ కథ.

============================================================================

సైనికుడు
నటీనటులు మహేష్ బాబు, త్రిష కృష్ణన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, కామ్న జెఠ్మలాని, కోట శ్రీనివాస రావు, రవి వర్మ అజయ్
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ గుణశేఖర్
ప్రొడ్యూసర్ :  అశ్విని దత్
రిలీజ్ డేట్ :  1 డిసెంబర్ 2006
మహేష్ బాబు కరియర్ లో సైనికుడు సినిమా ప్రత్యేకమైనది. రాజకీయ అవినీతి పరులపై ఒక యువకుడు చేసిన పోరాటమే సైనికుడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. త్రిష అమాయకత్వపు నటన సినిమాకే హైలెట్. హారిస్ జయరాజ్ ప్రతి పాట బావుంటుంది.

============================================================================

సాక్ష్యం

నటీనటులు బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే

ఇతర నటీనటులు శరత్ కుమార్, మీనా, జగపతి బాబు, రవి కిషన్, ఆశుతోష్ రానా, మధు గురుస్వామి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్

డైరెక్టర్ : శ్రీవాస్

ప్రొడ్యూసర్ : అభిషేక్ నామా

రిలీజ్ డేట్ : 27 జూలై 2018

స్వస్తిక్ నగరంలో ఉమ్మడి కుటుంబంతో అందరికీ ఆదర్శంగా, ఊరికి పెద్దగా ఉంటాడు రాజు గారు (శరత్ కుమార్). అదే ఊరిలో ఉంటూ తన తమ్ముళ్ళతో కలిసి అన్యాయాలకు, అక్రమాలకూ కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తాడు మునిస్వామి(జగపతిబాబు). తను చేసే ప్రతీ పనికి ఎదురు రావడంతో తన ముగ్గురు తమ్ముళ్ళు(రవి కిషన్, అశుతోష్ రానా)లతో కలిసి సాక్ష్యాలు లేకుండా రాజు గారు కుటుంబాన్ని మొత్తం హత్య చేస్తాడు ముని స్వామి. కానీ ఒక్క వారసుడు మాత్రం తప్పించుకుని చివరికి న్యూయార్క్ లో సెటిల్ అయిన వ్యాపారవేత్త శివ ప్రకాష్ (జయప్రకాష్)వద్ద విశ్వాజ్ఞ(బెల్లంకొండ సాయి శ్రీనివాస్)గా పెరిగి పెద్దవుతాడు.

అలా ఓ పెద్ద వ్యాపారవేత్త కొడుకుగా వీడియో గేమ్ డెవలపర్ గా జీవితాన్ని కొనసాగించే విశ్వజ్ఞ ఓ సందర్భంలో ఇండియా నుండి న్యూయార్క్ వచ్చిన సౌందర్య లహరి(పూజా హెగ్డే)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. పురాణాలు, ఇతిహాసాల మీదుగా ఆసక్తి ఉన్న సౌందర్యలహరి దగ్గర చాలా విషయాలు తెలుసుకుంటాడు. హఠాత్తుగా తన తండ్రి గురించి ఇండియాకి వెళ్ళిన సౌందర్య ను వెతుక్కుంటూ ఇండియాలో అడుగుపెడతాడు విశ్వాజ్ఞ.

ఇండియా వచ్చాక విశ్వ తనకు తెలియని వ్యక్తుల చావులకు కారణం అవుతాడు.. చంపే వాడికి చచ్చే వాడెవరో తెలియదు… చచ్చే వాడికి చంపెదేవరో తెలియదు విధి ఆడే ఈ ఆటలో ఏం జరిగింది… చివరికి తన కుటుంబాన్ని దారుణంగా చంపిన ముని స్వామీ ను అతని తమ్ముళ్ళను విస్వా ఎలా అంతమొందించాడు.. అనేది కథ.

============================================================================

నెక్స్ట్ నువ్వే

నటీనటులు : ఆది, వైభవి

ఇతర నటీనటులు : బ్రహ్మాజీ, రశ్మి గౌతమ్, హిమజ, L.B. శ్రీరామ్, శ్రీనివాస్ అవసరాల, రామ్ జగన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్

డైరెక్టర్ : ప్రభాకర్

ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేల్ రాజా, బన్నివాస్

రిలీజ్ డేట్ : నవంబర్ 3, 2017

ఆది, వైభవి జంటగా నటించిన కామెడీ థ్రిల్లర్ నెక్స్ట్ నువ్వే. కిరణ్ (ఆది) తన గర్ల్ ఫ్రెండ్ తో పాటు మరో ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి రిసార్ట్ నడుపుతుంటాడు. అయితే మిస్టీరియస్ గా ఆ రిసార్ట్ కి గెస్ట్ గా వచ్చిన వాళ్ళంతా చనిపోతుంటారు. ఆది & ఫ్రెండ్స్ కి ఏం చేయాలో అర్థంకాక ఆ శవాలను ఎవరికీ తెలియకుండా పూడ్చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఆ రిసార్ట్ లో పనిచేసే వ్యక్తి ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో కథ అడ్డం తిరుగుతుంది.

ఎవరైతే ఆ రిసార్ట్ లో ఇప్పటి వరకు చనిపోయారో, వారి వివరాలను పరిశీలించిన పోలీసులు, అవన్నీ ఆల్రెడీ చనిపోయిన వారి వివరాలని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. చనిపోయినవాళ్ళు మళ్ళీ చనిపోవడమేంటి..? అసలు ఆ రిసార్ట్ కి వరసగా వచ్చిన వాళ్ళెవరు..? వారికి ఆ రిసార్ట్ కి ఉన్న సంబంధమేంటి అనేదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం.