జీ సినిమాలు ( 25th జూలై )

Wednesday,July 24,2019 - 10:02 by Z_CLU

మాతంగి

నటీనటులు : రమ్య కృష్ణన్జయరామ్

ఇతర నటీనటులు : ఓం పురిశీలు అబ్రహాంరమేష్ పిషరోదిసాజు నవోదయఅక్షర కిషోర్ఏంజిలిన అబ్రహాం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రతీష్ వేఘ

డైరెక్టర్ : కన్నన్ తామరక్కులం

ప్రొడ్యూసర్ : హసీబ్ హనీఫ్నౌషాద్ అలాతుర్

రిలీజ్ డేట్ : 20 మే 2016

సత్యజిత్(జయరాం) ఓ ప్రముఖ వ్యాపార వేత్త.. ఉన్నట్టుండి రాత్రి వేళలో సత్యజిత్ కి కొన్ని పీడ కలలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఓ రోజు తన కుటుంబమంతా నాశనం అవ్వబోతుందనే కల కంటాడు… తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసంసమస్య కి పరిష్కారం వెతుక్కుంటూ మహేశ్వర బాబా(ఓం పూరి) ని కలుస్తాడు. అయితే సత్యజిత్ గతంలో కొన్న ఓ పాత భవనం వల్లే ఈ సమస్య వచ్చిందనిఅందులో ఉన్న మాతంగి అనే ఓ ఆత్మ వల్లే ఇదంతా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ పాత భవనంలో  ఆత్మగా మారిన మాతంగి ఎవరు…?  మాతంగి కి సత్యజిత్ కి సంబంధం ఏమిటి..చివరికి ఆ ఆత్మ నుంచి సత్యజిత్ తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా…? అనేది సినిమా కథాంశం.

==============================================================================

గోరింటాకు

నటీనటులు : రాజ శేఖర్ఆర్తి అగర్వాల్ , మీరా జాస్మీన్

ఇతర నటీనటులు : ఆకాష్హేమ చౌదరి,సుజితశివ రాజామాస్టర్ నిధీశ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎ.రాజ్ కుమార్

డైరెక్టర్ : వి.ఆర్.ప్రతాప్

ప్రొడ్యూసర్ : ఎం.వి.ప్రసాద్పారస్ జైన్

రిలీజ్ డేట్ : జులై 4 , 2008

అన్న-చెల్లెళ్ళ బంధం కధాంశం తో రాజ శేఖర్ఆర్తి అగర్వాల్మీరా జాస్మీన్ నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజ శేఖర్-మీరా జాస్మీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలుఅన్న-చెల్లెళ్ళ బంధం గురించి తెలియజేసే సీన్స్ సినిమాకు హైలైట్స్. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన పాటలుఆర్.ఆర్. సినిమాకు ప్లస్.

=============================================================================

పండగ చేస్కో

నటీనటులు : రామ్రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : సాయికుమార్సోనాల్ చౌహాన్బ్రహ్మానందంఆదిత్య మీనన్రావు రమేష్పవిత్ర లోకేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : రవి కిరీటి

రిలీజ్ డేట్ : 29 మే 2015

రామ్రాకుల్ జంటగా నటించిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పండగ చేస్కో. తన కుటుంబ సభ్యుల మధ్య అగాధంలా పేరుకుపోయిన దూరాన్ని హీరో ఎలా తగ్గించాడు..సమస్యని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ప్రధాన కథాంశం. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

మణికర్ణిక

నటీనటులు : కంగనా రనౌత్మొహమ్మద్ జీషన్ అయ్యుబ్

ఇతర నటీనటులు : అతుల్ కులకర్ణిజీషు సేన్ గుప్తారిచర్డ్ కీప్సురేష్ ఒబెరాయ్డానీ డెన్ జోంగ్ పాఅంకిత లోఖాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్ – ఎహసాన్- లాయ్

డైరెక్టర్ : క్రిష్

ప్రొడ్యూసర్ : జీ స్టూడియోస్కమాల్ జైన్నిశాంత్ పిట్టి

రిలీజ్ డేట్ : 25 జనవరి 2019

మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా మణికర్ణిక. ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటీషు వారి బారిన పడకుండా లక్ష్మీ బాయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది..తన ప్రజలను కలుపుకుని వారిపై ఎలా తిరగబడింది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. యుద్ధ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

గీతాంజలి

నటీనటులు : అంజలిశ్రీనివాస్ రెడ్డి

ఇతర నటీనటులు : మధునందన్హర్షవర్ధన్ రాణేబ్రహ్మానందంఆలీరావు రమేష్సత్యం రాజేష్శంకర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ : రాజ్ కిరణ్

ప్రొడ్యూసర్ : కోన వెంకట్

రిలీజ్ డేట్ : 8 ఆగష్టు 2014

అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గీతాంజలి. ఈ సినిమాలో అంజలి డ్యూయల్ రోల్ లో ఎంటర్ టైనర్ చేసింది. ఫ్లాష్ బ్యాక్ లో ఇన్నోసెంట్ అమ్మాయిగా అంజలి నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

==============================================================================

అహ నా పెళ్ళంట
నటీనటులు : అల్లరి నరేష్శ్రీహరిరీతు బర్మేచ
ఇతర నటీనటులు : అనిత హాసనందినిబ్రహ్మానందంఆహుతి ప్రసాద్సుబ్బరాజువిజయ్ సామ్రాట్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె
డైరెక్టర్ : వీరభద్రం
ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 2 మార్చి 2011


రియల్ స్టార్ శ్రీహరినరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.