త్వరలోనే సెట్స్ పైకి క్రేజీ కాంబినేషన్

Saturday,March 28,2020 - 01:49 by Z_CLU

రాఘవన్.. కమల్ హాసన్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ కాప్ మూవీ. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. అవును.. స్వయంగా గౌతమ్ మీనన్ ఈ విషయాన్ని బయటపెట్టాడు.

“ప్రస్తుతం కమల్ సర్ తో స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఏప్రిల్ లో కమల్ కు ఫైనల్ నెరేషన్ ఇస్తాను. అంతా ఓకే అయితే ఆ వెంటనే సెట్స్ పైకి వెళ్తాం.”

ఇలా రాఘవన్-2పై క్లారిటీ ఇచ్చాడు గౌతమ్ మీనన్. తమిళ్ లో ఈ సినిమా వెట్టైయాడు విళయాడు. ఆ సినిమాకు డబ్బింగ్ వెర్షనే రాఘవన్. ఈ సినిమాతో కమల్ హాసన్ ఉత్తమ నటుడిగా తమిళనాడు స్టేట్ అవార్డ్ అందుకున్నాడు. హీరోయిన్ గా నటించిన జ్యోతికకు కూడా మంచి మార్కులు పడ్డాయి. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా హిట్టయింది.