హాట్ టాపిక్: RRRలో విజయ్

Saturday,March 28,2020 - 04:07 by Z_CLU

రాజమౌళి డైరక్ట్ చేస్తున్న పాన్-ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ లో ఇప్పటికే చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలతో పాటు అలియాభట్ లాంటి హీరోయిన్.. అజయ్ దేవగన్, సముత్తరఖని లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్ కు మరో స్టార్ యాడ్ అవ్వబోతున్నాడు.

అవును.. RRRలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న అతిపెద్ద గాసిప్ ఇదే. కోలీవుడ్ లో విజయ్ అంటే మామూలు హీరో కాదు. రజనీకాంత్ తర్వాత ఆ స్థానం కోసం పోటీపడుతున్న హీరో. అలాంటి హీరో, RRRలో గెస్ట్ రోల్ చేస్తాడా అనేది పెద్ద డౌట్.

అయితే ఇంతకుముందు గెస్ట్ రోల్ చేసిన అనుభవం విజయ్ కు ఉంది. ప్రభుదేవా డైరక్ట్ చేసిన రౌడీ రాథోడ్ అనే హిందీ సినిమాలో మెరిశాడు. కాబట్టి రాజమౌళి గట్టిగా ట్రై చేస్తే RRRలో కూడా విజయ్ కనిపించే అవకాశం ఉందనేది చాలామంది లాజిక్.

ఈ లాజిక్కుల సంగతి పక్కనపెడితే ప్రస్తుతం విజయ్ మాత్రం యమ బిజీగా ఉన్నాడు. మాస్టర్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత తన సూపర్ హిట్ మూవీ తుపాకికి రీమేక్ చేసే ప్లాన్స్ లో ఉన్నాడు.