బిజీ బిజీగా శృతిహాసన్

Monday,October 10,2016 - 03:27 by Z_CLU

ఏమాత్రం టైం దొరికినా లండన్ చెక్కేయడం శృతిహాసన్ కు అలవాటు. ఎందుకంటే, అది ఆమె ఫేవరెట్ స్పాట్. బాగా అలసినట్టు అనిపించినా, ప్రశాంతంగా కొన్ని రోజులు గడపాలని భావించినా.. సూట్ కేస్ సర్దుకొని లండన్ ఫ్లయిట్ ఎక్కేస్తుంది. ఈసారి కూడా అదే పనిచేసింది కమల్ కూతురు. దసరాకు ముందు అనుకోకుండా 5 రోజులు గ్యాప్ దొరకడంతో లండన్ వెళ్లిపోయింది. స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపేసింది. ఆ మెమొరబుల్ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో అభిమానులతో కూడా షేర్ చేసుకుంది. తిరిగి ఇండియా వచ్చిన విషయాన్ని కూడా ప్రకటించింది. మళ్లీ పనిలో మునిగిపోతున్నానని, మీ ఆశీర్వాదం కావాలంటూ ప్రేక్షకులను కోరుకుంది శృతిహాసన్.