కమల్ హాసన్ - గౌతమి విడిపోయారు...

Tuesday,November 01,2016 - 03:44 by Z_CLU

దాదాపు 13 ఏళ్లుగా కలిసున్న కమల్ హాసన్, గౌతమి విడిపోయారు. ఈ వార్త విని కోలీవుడ్ మాత్రమే కాదు…టోటల్ సౌత్ ఇండియా అంతా షాక్ అయింది. కానీ ఇది నిజం. తామిద్దరం విడిపోయిన విషయాన్ని స్వయంగా గౌతమి… సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.. జీవితంలో ఇలాంటి సంఘటన ఎదురవుతుందని కలలో కూడా ఊహించలేదని.. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గౌతమి వెల్లడించారు. గతంలో గౌతమి కాన్సర్ బారిన పడినప్పుడు ఆమెకు మోరల్ సపోర్ట్ ఇచ్చిన అతికొొద్దిమంది వ్యక్తుల్లో కమల్ హాసన్ ఒకరు. అప్పట్నుంచే కమల్ కు తను బాగా దగ్గరయ్యాననే విషయాన్ని గౌతమి చాలాసార్లు చెప్పుకొచ్చారు.

kamal_2469865g

అలా దాదాపు 13 ఏళ్ల పాటు గౌతమీ-కమల్ కలిసి జీవించారు. కానీ ఈమధ్య మాత్రం వాళ్ల మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆ వార్తలు నిజమనే విషయాన్ని గౌతమి కన్ ఫర్మ్ చేశారు. మొన్నటికి మొన్న కోలీవుడ్ లో హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు ఏఎల్ విజయ్ విడిపోయారు. ఇప్పుడు తాజాగా గౌతమి-కమల్ హాసన్ కూడా విడిపోయారు.

gauthami-final