ప్రేమిస్తాను.. అప్పుడు పెళ్లి చేసుకోను

Saturday,March 28,2020 - 01:25 by Z_CLU

రీసెంట్ గా తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది హీరోయిన్ కృతి కర్బందా. బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉన్నట్టు ఒప్పుకుంది. అయితే ప్రస్తుతానికి తమ రిలేషన్ షిప్ డేటింగ్ వరకే అంటోంది ఈ బ్యూటీ.

“నేను, పుల్కిత్ ప్రతి రోజును ఆస్వాదిస్తున్నాం. పెళ్లి గురించి మేం అస్సలు ఆలోచించడం లేదు. పుల్కిత్ కు అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నాది కూడా అదే ఫీలింగ్. మా పెళ్లి మరికొన్ని ఏళ్లు పట్టొచ్చు.”

ఇలా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది కృతి కర్బందా. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన తీన్ మార్ సినిమాలో నటించిన ఈ చిన్నది.. బోణీ, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, బ్రూస్ లీ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. అందుకే పెళ్లిని కొన్నేళ్లు వాయిదా వేసుకున్నారు.