హలో హీరోయిన్ కి 'ఐ హేట్ యూ' మెసేజెస్

Tuesday,December 26,2017 - 04:31 by Z_CLU

‘హలో’ సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది కళ్యాణి ప్రియదర్శన్. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ యూత్ ని ఎట్రాక్ట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సక్సెస్ తో పాటు, ఫ్యాన్స్ నుండి వస్తున్న ‘ఐ  హేట్  యూ ’ మెసేజెస్ తో ఉక్కిరిబిక్కిరవుతుంది కళ్యాణి.

‘హలో’ సినిమాలో హీరో తన పేరెంట్స్ తో తన మనసులో వాళ్ళపై ఉన్న అన్ లిమిటెడ్ ప్రేమను కన్వే చేసే ప్రాసెస్ లో ‘ ఐ  హేట్  యూ ’ అన్నట్టు, ఇప్పుడు ఫ్యాన్స్ కూడా కళ్యాణికి అదే పద్ధతిలో ‘ఐ  హేట్  యూ ’ మెసేజెస్ పంపుతున్నారట.

ఒక్క సినిమాతోనే ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అవ్వడానికి రీజన్ అయిన ఈ సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ కి అదే స్టైల్ లో ‘ఐ  హేట్  యూ’ అంటూ ట్వీట్ చేసి థాంక్స్ చెప్పుకుంది కళ్యాణి.