N. శంకర్ ఇంటర్వ్యూ...

Tuesday,December 26,2017 - 05:00 by Z_CLU

సునీల్ ‘2 కంట్రీస్’ ఈ ఫ్రైడే గ్రాండ్ గా రిలీజవుతుంది. N. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ సరౌండింగ్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుండి రిలీజయ్యే వరకు జరిగిన ఇంట్రెస్టింగ్ జర్నీని మీడియాతో షేర్ చేసుకున్నాడు N. శంకర్. ఆ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీకోసం…

ప్రేక్షకుల్లో డిమాండ్ ఉన్న కంటెంట్…

ఎంటర్ టైన్ మెంట్ వ్యాల్యూస్ ఉన్న సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటుంది. అందుకే అలాంటి సినిమానే చేయాలని  ముందే ఫిక్సయ్యా…

 

సంబంధం లేకుండా చేశాను…

నేనిప్పటివరకూ చేసినవన్నీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలే. ఏ సినిమా చేసినా ప్రతీది కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకునే వాణ్ణి. ‘2 కంట్రీస్’  సినిమా గురించి విన్నప్పుడు మలయాళంలో సూపర్ హిట్ సినిమా, అందునా బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ లాంటి వాళ్ళు ఈ సినిమా గురించి ట్వీట్ చేశారంటే, ఏ రేంజ్ లో క్రేజ్ క్రియేట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే చేస్తే ఈ సినిమా రీమేక్ చేద్దామనుకున్నా…

జర్నీ అలా బిగిన్ అయింది…

 ‘2 కంట్రీస్’ టీమ్ నాకు చాలా క్లోజ్. ఈ సినిమా సక్సెస్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, ఈ సినిమాని రీమేక్ చేసుకొమ్మని సజెస్ట్ చేశారు. అక్కడ మలయాళంలో దిలీప్ కి ఎలాంటి స్క్రీన్ ఇమేజ్ ఉందో, టాలీవుడ్ లో సునీల్ కి అలాంటి ఇమేజ్ ఉంది. అందుకే సునీల్ హీరో అని అపుడే ఫిక్సయిపోయా.. అలా మా జర్నీ బిగిన్ అయింది…

హీరోయిన్ క్యారెక్టర్ డిఫెరెంట్…

హీరోయిన్ ని అంత ఈజీగా సెలెక్ట్ చేసుకోలేదు. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి. అనుభవం, ట్యాలెంట్, డెడికేషన్ ఉన్న ఆర్టిస్ట్ అయితే కానీ ఈ క్యారెక్టర్ ని ప్లే చేయలేరు.. బిగినింగ్ లో స్టార్ హీరోయిన్స్ అనే అనుకున్నాం… కానీ ఆ తరవాత కొత్త అమ్మాయైనా ఈ అమ్మాయి పర్ఫెక్ట్ అనిపించింది…

సింగర్ అవుదామనుకుంది…

హీరోయిన్ కోసం అమెరికాలో స్టార్ హంట్ పెట్టాము… ఈ అమ్మాయి సింగర్ ఆఫర్ కోసమని అప్రోచ్ అయింది. కానీ అమెరికాలో ఉండి సింగర్ గా అంటే కష్టం అని చెప్పి, ఒకసారి ఆడిషన్ కి రమ్మని చెప్పాను, స్పాంటినియస్ గా చాలా బాగా పర్ఫామ్ చేసింది… అలా ఆ అమ్మాయి ఫిక్సయింది…

అదే సునీల్ క్యారెక్టర్…

సునీల్ క్యారెక్టర్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఏ మాత్రం లక్ష్యం అంటూ లేని క్యారెక్టర్. డబ్బు మాత్రమే  కావాలి. ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి… పనీ పాట లేకుండా బిందాస్ గా ఉండే ఈ క్యారెక్టర్ చుట్టూ చాలా ఫన్ జెనెరేట్ అవుతూంటుంది. అలాంటి వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఏ లెవెల్ కి వెళతాడు అనేదే సినిమా ప్రధాన కథాంశం…

 

అందుకే ప్రొడ్యూసర్ నయ్యా…

ఈ సినిమాని రిచ్ వ్యాల్యూస్ తో తెరకెక్కించాలి, ఒకవేళ వేరే ప్రొడ్యూసర్ అయితే  కో ఆపరేట్ చేయడం కొంచెం  కష్టమే అనిపించింది. ఏది ఏమైనా…. రిస్క్ అనుకున్నా, వచ్చే లాభం నాకే రావాలి అనే స్వార్థం అనుకున్నా…. కారణం ఏదైనా ఈ సినిమాని నేనే నిర్మించాలనుకున్నా…

బోలెడు మంది ఆర్టిస్టులు…

నరేష్, పృథ్వీ, శ్రీనివాస్ రెడ్డి, సితార, ఝాన్సీ, చంద్రమోహన్, ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో మొత్తం 26 మంది ఆర్టిస్టులున్నారు.

హిందీ రీమేక్…

ఇదే సినిమాను హిందీలో అజయ్ దేవ్ గన్ తో చేస్తున్నాం. ఈ సినిమా అయ్యాక ఆ సినిమా గురించి డీటేల్స్ అనౌన్స్ చేస్తాం…

ప్రేక్షకులు కోరుకునేదే సినిమాలో…

ప్రేక్షకులు సునీల్ నుండి ఎలాంటి ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ కోరుకుంటారో, అలాంటి ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న సినిమా 2 కంట్రీస్. అందుకే సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాము..