ఆ టైటిల్ తో కళ్యాణ్ రామ్ సినిమా ...

Saturday,May 06,2017 - 04:00 by Z_CLU

‘ఇజం’ తర్వాత ఎన్టీఆర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఓ కొత్త దర్శకుడితో సెట్స్ పైకెళ్లేందుకు అవుతున్నాడు. ‘ఇజం’ తర్వాత కొందరు దర్శకులు దగ్గర కథలు విన్న కళ్యాణ్ రామ్ ఫైనల్ గా శ్రీను వైట్ల, అనిల్ రవి పూడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఉపేంద్ర కథ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి త్వరలోనే ఈ కొత్త డైరెక్టర్ తో సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడట ..

ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాను విశ్వనాధ్, భరత్ అనే ఇద్దరు నిర్మాతలు కలిసి నిర్మించనున్నారట. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ సినిమాకు ఇప్పటికే ఎం.ఎల్.ఎ (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే టైటిల్ ని కూడా రిజస్టర్ చేయించారనే టాక్ వినిపిస్తుంది. ఇక ఇజం లో సిక్స్ పాక్ తో స్టైలిష్ గా కనిపించి ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కూడా సరి కొత్త లుక్ లో మరింత స్టైలిష్ గా కనిపించబోతున్నాడని సమాచారం.. ఈ సినిమాను త్వరలోనే పూజ కార్యక్రమాలతో స్టార్ట్ చేసి జూన్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాడని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్…