ఫస్ట్ సాంగ్ హల్చల్ ....

Saturday,May 06,2017 - 03:24 by Z_CLU

అక్కినేని నాగ చైతన్య-రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్స్ గా ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.. లవ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదటి పాట ప్రెజెంట్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది…

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని మొదటి పాట గా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రెజెంట్ అందరినీ ఆకట్టుకుంటూ ఆల్బమ్ పై అంచనాలు పెంచేస్తుంది.. రారండోయ్ వేడుక చూద్దాం అంటూ  పెళ్లి వేడుక లో వచ్చే  ఈ పాటలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందరిని అలరిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను రేపు రిలీజ్ చేయబోతున్నారు.. మే రెండో వారం లో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్…