స్టూడియో రౌండప్

Saturday,May 05,2018 - 11:04 by Z_CLU

బెల్లంకొండ శ్రీనివాస్  – సాక్ష్యం 

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీ వాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘సాక్ష్యం’.  రీసెంట్  గా  సారధి స్టూడియోస్ లోని ప్రత్యేకమైన సెట్ లో పూజా, శ్రీనివాస్ లపై డ్యూయెట్ సాంగ్ షూట్ చేసిన  సినిమా  యూనిట్,  ఈ షెడ్యూల్  తో టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

 

సుధీర్ వర్మ – శర్వానంద్ 

శర్వానంద్ -సుధీర్ వర్మ సినిమా ప్రస్తుతం అల్యూమినియం ఫాక్టరీ లో షూట్ జరుపుకుంటుంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తుంది యూనిట్. ఈ సినిమాలో శర్వా సరసన కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్ గా నటిస్తుంది.

 

నాగచైతన్య – సవ్యసాచి 

చందూ మొండేటి డైరెక్షన్ లో నాగ చైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ రేపటి నుండి అమెరికా లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ లో ఓ సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ షూట్ చేస్తారు యూనిట్. సినిమాకు సంబంధించి ఇదే ఫైనల్ షెడ్యూల్. ఈ షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ పూర్తిచేసుకోనుంది ఈ సినిమా.  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మాధవన్ , భూమిక స్పెషల్ రోల్స్ ప్లే చేస్తున్నారు.

 

కళ్యాణ్ రామ్ – గుహన్ సినిమా 

కళ్యాణ్ హీరోగా K.V. గుహన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యుల్ లో కళ్యాణ్ రామ్, శాలినీ పాండే, ప్రభాస్ శ్రీను తదితరులపై కొన్ని కీలక సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ మే 12 వరకు జరగనుంది. కళ్యాణ్ సరసన నివేత థామస్, శాలిని పాండే హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు.