నా పేరు సూర్య ఫస్ట్ డే కలెక్షన్

Saturday,May 05,2018 - 11:55 by Z_CLU

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా మొదటి రోజు మెస్మరైజ్ చేసింది. ప్రతి సెంటర్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టించింది. బన్నీ కెరీర్ లోనే రెండో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది నా పేరు సూర్య.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్ దక్కింది. దాదాపు 230 లొకేషన్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా, మొదటి రోజే ప్రీమియర్స్ తో కలుపుకొని హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ టచ్ చేసింది. శని, ఆదివారాల వసూళ్లతో ఇది 1 మిలియన్ టచ్ చేసే ఛాన్స్ ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ఏపీ, నైజాం కలుపుకొని దాదాపు 16 కోట్ల రూపాయల షేర్ వచ్చింది నా పేరు సూర్య సినిమాకి. నైజాంలో అత్యథికంగా 4 కోట్ల రూపాయలొచ్చాయి.

ఏపీ, నైజాం మొదటి రోజు షేర్

నైజాం – రూ. 4.05 కోట్లు
సీడెడ్ – రూ. 2.30 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.02 కోట్లు
ఈస్ట్ – రూ. 2.06 కోట్లు
వెస్ట్ – రూ. 1.53 కోట్లు
గుంటూరు – రూ. 2.47 కోట్లు
కృష్ణా – రూ. 1.04 కోట్లు
నెల్లూరు – రూ. 0.62 కోట్లు