రవితేజ సినిమాకి కాజల్ ఫిక్స్ ?

Sunday,October 08,2017 - 10:06 by Z_CLU

ఈ నెలలో ‘రాజా ది గ్రేట్’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేయబోతున్న మాస్ మహా రాజ్ రవి తేజ త్వరలోనే శ్రీను వైట్ల తో ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే… ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది. ఈ సూపర్ హిట్ కాంబో సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తుంది.

మొన్నటి వరకూ ఈ సినిమాకు హీరోయిన్ గా పలు పేర్లు వినిపించగా ఇప్పుడు కాజల్ కే ఫిక్స్ అయ్యారట మేకర్స్. ప్రెజెంట్ వార్త గానే ఉన్న ఈ న్యూస్ నిజమైతే కనుక రవితేజతో ‘వీర’, ‘సారొచ్చారు’ సినిమాల్లో నటించిన కాజల్ ఈ సినిమాతో మాస్ మహారాజ్ తో ముచ్చటగా మూడో సారి నటించినట్లే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.