మహేష్ తో మరో సారి ?

Sunday,October 08,2017 - 11:02 by Z_CLU

లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి సూపర్ స్టార్ తో నటించే సూపర్ ఛాన్స్ కొట్టేసిందట. త్వరలో వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ నే ఫైనల్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇటీవలే స్పైడర్ లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడంతో మళ్ళీ కాంబినేషన్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.


ప్రస్తుతం కొరటాల శివ తో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్న మహేష్ ఈ సినిమా ఫైనల్ స్టేజి కి చేరుకోగానే వంశీ పైడి పల్లి సినిమా మొదలెట్టనున్నాడు. అశ్వనీదత్- దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.