యంగ్ అయినా సీనియర్ అయినా ‘సై’...

Monday,March 25,2019 - 05:39 by Z_CLU

ఏ రేంజ్ స్టార్ సినిమా అయినా… హీరోయిన్ కూడా మ్యాటరే. అందుకే సినిమా సబ్జెక్ట్ ని బట్టి బెస్ట్ అనిపించిన వాళ్ళనే పిక్ చేసుకుంటారు మేకర్స్. అలా ఈ ప్రాసెస్ లో యంగ్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్స్, అవకాశం రావాలే కానీ సీనియర్ హీరోస్ తో కూడా సై అంటున్నారు. ఈ వరసలో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది.

రకుల్ ప్రీత్ సింగ్ : నాగార్జున తో ‘మన్మధుడు 2’ లో నటించనుంది రకుల్ ప్రీత్ సింగ్. రీసెంట్ గా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో నాగచైతన్య సరసన నటించి మెప్పించిన రకుల్, ఈ సారి ఈ సీనియర్ మన్మధుడితో, మరింత మెస్మరైజ్ చేయనుంది.

కాజల్ అగర్వాల్ : రామ్ చరణ్ తో మగధీర, నాయక్, ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాల్లో నటించిన కాజల్ మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నం 150’ లో చిరు సరసన నటించి సినిమాకి మరింత గ్లామర్ తీసుకొచ్చింది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ సరసన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో కూడా నటించింది.

తమన్నా : రామ్ చరణ్ సరసన ‘రచ్చ’ లో నటించింది తమన్నా. ఇప్పుడు మెగాస్టార్ ‘సైరా’ లోను కూడా కీ రోల్ లో కనిపించనుంది. ఈ క్యారెక్టర్ గురించి ప్రస్తుతానికి పెద్దగా రివీల్ కాలేదు కానీ, మెగాస్టార్ కాంబినేషన్ లో ఇంపార్టెంట్ స్పేస్ షేర్ చేసుకుంటుందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో ‘కెమెరా మెన్ గంగ’ లోను నటించిందీ మిల్కీ బ్యూటీ.

నయనతార : రానా సరసన ‘కృష్ణం వందే జగద్గురుం’ లో నటించింది నయనతార. ఈ సినిమా కన్నా ముందే వెంకీ కి బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడీ అనే ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. విక్టరీ వెంకటేష్ తో లక్ష్మి, తులసి, బాబు బంగారం సినిమాల్లో నటించింది నయనతార.

ఈ లెక్కన చూసుకుంటే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన సమంతా, శృతి హాసన్ లు కూడా యంగ్ మెగా హీరోలు బన్ని, రామ్ చరణ్ ల సరసన నటించి, పర్ఫామెన్స్ కి స్కోప్ ఉండాలే కానీ, యంగ్ అయినా సీనియర్ అయినా ‘సై’ అనిపించుకున్నారు.