శృతి హాసన్ తరవాత కాజల్ అగర్వాల్..?

Thursday,July 04,2019 - 01:02 by Z_CLU

మొత్తానికి శృతి హాసన్ హాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకోవడంలో సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ వరసలో కాజల్ అగర్వాల్ కూడా చేరనుంది. త్వరలో ఓ హాలీవుడ్ సినిమాలో నటించనుంది. దీని సంబంధించి డీటేల్స్ పెద్దగా బయటికి రాలేదు కానీ, మంచు విష్ణు ఈ సినిమాని నిర్మించబోతున్నాడనే టాక్ టాలీవుడ్ లో కొంచెం గట్టిగానే వినిపిస్తుంది.

ఈ సినిమాకి సంబంధించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఏం మాట్లాడినా, ఇప్పటికిప్పుడు తొందరపడినట్టే అవుతుంది కానీ, ఈ టాక్ తో ఓ విషయం మాత్రం గట్టిగా బయటపడింది. కాజల్ అగర్వాల్ కూడా శృతి హాసన్ లాగే హాలీవుడ్ డెబ్యూ కి ప్రయత్నాలు మొదలుపెట్టేసింది.

ఒకవేళ మంచు విష్ణు హాలీవుడ్ ప్రొడక్షన్ నిజమే అయితే ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ హాలీవుడ్ ఎంట్రీ జరిగిపోతుంది. ఒకవేళ ఈ సినిమా టాక్ కాస్త అటూ, ఇటూ అని తేలితే, కాస్త లేట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి కానీ, కాజల్ అగర్వాల్ హాలీవుడ్ ఎంట్రీ మాత్రం పక్కాగా జరుగుతుంది.  

 

రీసెంట్ గా ‘సీత’ లా మెస్మరైజ్ చేసిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం శర్వా ‘రణరంగం’ లో నటిస్తుంది. ఈ గ్యాప్ లో మరిన్ని కథల్ని వినే పనిలో ఉన్న ఈ స్టార్ హీరోయిన్, మరో వైపు హాలీవుడ్ కరియర్ విషయంలో కూడా అంతే  సీరియస్ ప్లానింగ్ లో ఉంది.