అఫీషియల్ : సతీష్ వేగేశ్నతో కళ్యాణ్ రామ్

Wednesday,June 12,2019 - 11:30 by Z_CLU

నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ సినిమాల దర్శకుడు సతీష్ వేగేశ్నతో సినిమా చేయబోతున్నాడంటూ వార్త బయటికొచ్చింది. ఈ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాను ఈ రోజు అఫీషియల్ అనౌన్స్ చేసారు మేకర్స్. సంగీత రంగంలో త‌న‌దైన ముద్ర‌వేసిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ సినిమా ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ స‌మ‌ర్పిస్తున్న ఈ సినిమాకు ఉమేష్ గుప్త నిర్మాత. కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించనుంది.

శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా జులై నెలాఖరు నుండి సెట్స్ పైకి రానుందని సమాచారం. ఫీల్ గుడ్ మూవీ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.