స్టార్ హీరోలకు దూరమవుతున్న కాజల్ అగర్వాల్

Tuesday,April 09,2019 - 12:02 by Z_CLU

మ్యాగ్జిమం టాప్ స్టార్స్ తో నటించేసింది. మెగాస్టార్ కమ్ బ్యాక్ సినిమా ‘ఖైదీ నం 150’ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఓ సీజన్ లో టాప్ స్టార్ అని కూడా అనిపించుకుంది. ఒకప్పుడేంటి..? ఇప్పుడు కూడా అంతే. ఇప్పటికీ కాజల్ అగర్వాల్ సినిమా రిలీజ్ కి ఉందంటే ఫ్యాన్స్ లో రెస్పాన్స్ ఇంకా అదే రేంజ్ లో ఉంటుంది. కానీ కాజల్ అగర్వాల్ సినిమాలోనే స్టార్ హీరో కనిపించట్లేదు.

ఒక రకంగా చెప్పాలంటే కాజల్ అగర్వాల్ ‘ఖైదీ నం 150’ తరవాత మళ్ళీ ఆ స్థాయి హీరోతో నటించనే లేదు. ఈ సినిమా తరవాత ‘నేనే రాజు నేనే మంత్రి’ చేసినా, దీని తరవాత వచ్చిన సినిమాలు నాని నిర్మించిన ‘అ!’, కళ్యాణ్ రామ్ ‘MLA’. ఈ సినిమాల తరవాత బెల్లంకొండ తో 2 సినిమాలు కమిట్ అయితే, ‘కవచం’ ఆల్రెడీ రిలీజయింది. ‘సీత’ రిలీజ్ కి రెడీ అవుతుంది. వీటిలో ఎక్కడా టాప్ స్టార్ లేడు.

 

కాజల్ చేస్తున్న చిన్న సినిమాలతో ఫ్యాన్స్ లో క్రేజ్ తగ్గుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం కానీ, డెఫ్ఫినెట్ గా స్టార్ హీరో సరసన కాజల్ అగర్వాల్ కనిపించకపోవడం, ఫ్యాన్స్ లో చిన్న సైజు వెలితి నైతే క్రియేట్ చేస్తుంది. మరి ఈ గ్యాప్ కాజల్ కావాలనే క్రియేట్ చేస్తుందా..? లేకపోతే కాజల్ ఎక్స్ పెక్ట్ చేసిన స్థాయిలో అవకాశాలు రావట్లేదా..?

స్టార్ సినిమాలు అనౌన్స్ అయిన కొద్దీ హీరోయిన్ స్పేస్ లో కాజల్ అగర్వాల్ పేరు ఉండకపోతుందా..? అని ఎక్స్ పెక్ట్ చేయడం, తీరా సమయానికి ఇంకో పేరు ఫిక్సవ్వడం లాంటిది జరిగిపోతుంది. స్టార్ హీరోస్ నిజంగానే కాజల్ ని ప్రిఫర్ చేయట్లేదా..? అనేది పక్కన పెడితే, కాజల్ కూడా పెద్దగా స్టార్ హీరోల సినిమాలపై ఫోకస్ పెట్టట్లేదేమో అనే ఫీలింగ్ ఫ్యాన్స్ లో స్టార్ట్ అయిపోయింది. మరి కాజల్ మైండ్ లో ఏం నడుస్తుందో చూడాలి.