జెర్సీ.. డేట్స్ రెడీ

Tuesday,April 09,2019 - 12:20 by Z_CLU

జెర్సీ సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటూ మొన్నటివరకు రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ కు చెక్ పెట్టేందుకు యూనిట్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టింది. స్వయంగా హీరో నాని ఈ ప్రెస్ మీట్ కు వచ్చాడు. సినిమాపై మరింత క్లారిటీ ఇచ్చాడు.

ఇప్పటివరకు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాం. అందుకే ఎవరికీ అందుబాటులోకి రాలేకపోయాం. ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయలేకపోయాం. ఇప్పుడు సినిమా వర్క్ పూర్తయింది. ఇకపై ప్రతిరోజు ప్రేక్షకుల్ని పలకరిస్తాం. ఎట్టిపరిస్థితుల్లో ఏప్రిల్ 19న థియేటర్లలోకి వస్తాం.

జెర్సీ సినిమాకు సంబంధించి మరో రెండు తేదీల్ని కూడా ఫిక్స్ చేశాడు నాని. ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ ను ఏప్రిల్ 12న ఉదయం 9 గంటలకు విడుదల చేస్తామని.. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను 15వ తేదీన పెడుతున్నామని క్లారిటీ ఇచ్చాడు.

ఇలా జెర్సీకి సంబంధించి ఆడియన్స్ లో ఉన్న అనుమానాలన్నింటినీ క్లియర్ చేశాడు నాని. తన కెరీర్ లో మోస్ట్ హార్ట్ టచింగ్ మూవీగా జెర్సీ సినిమాను చెప్పుకొచ్చిన నాని, సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని ప్రకటించాడు.