నాని జెర్సీ – టార్గెట్ నేషనల్ ప్లేయర్

Tuesday,April 09,2019 - 11:03 by Z_CLU

నాని ‘జెర్సీ’ టీజర్స్ రిలీజయ్యాయి. ఒక్కొక్కటిగా సాంగ్స్ రిలీజవుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ కూడా పెంచేశారు మేకర్స్. కానీ స్టోరీలైన్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్సే. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అని తెలుసు కానీ, సినిమాలో ఎఫెక్ట్ చేయబోయే డామినేటింగ్ ఎలిమెంట్ అనేది సినిమా చూస్తేనే కానీ తెలీదు. అయితే రీసెంట్ గా ‘జెర్సీ’ కి సంబంధించి ఓ విషయం బయటపెట్టాడు నాని.

సినిమాలో అర్జున్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి తనకు 26 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆడుతూనే ఉంటాడు. ఆ తరవాతే ఆపేస్తాడు. తన ఫెయిల్యూర్స్ కి, క్రికెట్ ని పక్కన పెట్టడానికి మధ్య రీజన్స్ ఏంటనేది ఇంకా బయటికి రాలేదు కానీ, దాదాపు పదేళ్ళు మళ్ళీ క్రికెట్ వైపుకి కూడా వెళ్ళడంట అర్జున్. కానీ మళ్ళీ పదేళ్ళ తరవాత.. తన 36 ఏళ్ల వయసులో మళ్ళీ క్రికెట్ బ్యాట్ పడతాడు. అందుకే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజయినప్పుడు పోస్టర్ లో ‘36’ నంబర్ ని కూడా మెన్షన్ చేశారు మేకర్స్. కానీ అది ఇప్పుడు టైటిల్ లో ఎక్కడా భాగం కాదు. దానికి కూడా ఓ రీజన్ చెప్పాడు నాని.

సినిమాలో హీరో ఇంటర్నేషనల్ ప్లేయర్ కాదు. రంజీ ప్లేయర్. సాధారణంగా రంజీ ప్లేయర్స్ కి నంబర్ ఉండదు కాబట్టి, కాస్త లేట్ గా రియలైజ్ అయినా, ఈ నంబర్ ని మెన్షన్ చేయకపోవడమే కరెక్టని ఫిక్సయ్యారట మేకర్స్. ప్రస్తుతానికి ఆ నంబర్ సంగతి పక్కన పెడితే, ఈ నంబర్ గురించి చెప్తూ, చెప్తూ నాని సినిమాలోని తన క్యారెక్టర్ టార్గెట్ ఏంటో రివీల్ చేశాడు.

ఒక సాధారణ  రంజీ ప్లేయర్ ‘అర్జున్’ టార్గెట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వడం. యంగ్ ఏజ్ లో ఫెయిల్ అయినా,  తన 36 వ ఏట బ్యాట్ పట్టిన మన హీరో, తనకున్న అడ్డంకులను ఫేస్ చేసుకుంటూ, ఇంటర్నేషనల్ ప్లేయర్ అనిపించుకున్నాడా లేదా..? అనేదే ‘జెర్సీ’ లో మెయిన్ ఎలిమెంట్.