కాజల్ అగర్వాల్ ఇంటర్వ్యూ

Tuesday,December 04,2018 - 06:59 by Z_CLU

2018 తన కరియర్ లోనే అమేజింగ్ ఇయర్ అని చెప్పుకుంది కాజల్ అగర్వాల్. ‘అ!’ నుండి బిగిన్ అయితే ఈ సంవత్సరం చేసిన సినిమాలన్నీ ఏదో ఒక ప్రత్యేకత ఉన్న సినిమాలే అని ఎగ్జైటెడ్ గా చెప్పుకున్న కాజల్ అగర్వాల్, మీడియాతో జరిగిన డిస్కర్షన్ లో   మరిన్ని విషయాలు షేర్ చేసుకుంది. అవి మీకోసం.

అలా ఏం లేదు…

చేసే ప్రతి సినిమాలో నాకంటూ స్పెషల్ రోల్ ఉండాలని నేను రూల్ పెట్టుకోలేదు. ‘కవచం’ ఎందుకు చేశానంటే, టోటల్ సినిమానే కొత్త జోనర్ లో ఉంటుంది.

అది నా స్టేజ్…

ఇప్పుడు నేనున్న స్టేజ్ లో ట్యాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నా. జస్ట్ నా క్యారెక్టర్ గురించే కాదు, కంప్లీట్ గా సినిమా బావుంటుంది అనిపిస్తే చేసేస్తా.

అదీ కవచం…

‘కవచం’ గురించి చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. దాంతో పాటు సినిమాలో ఫాస్ట్ పేజ్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి.

సినిమా మొత్తం…

సినిమా ఫస్టాఫ్ మొత్తం ఒక స్టోరీ రన్ అవుతూంటుంది. సెకండాఫ్ లో ఇంట్రెస్టింగ్ ప్లాట్ రివీల్ అవుతుంది. ఆడియెన్స్ కి అది మైండ్ బ్లోయింగ్ ఎక్స్ పీరియన్స్ అవుతుంది.

అదీ నా ప్లానింగ్…

సినిమా స్టార్ హీరోస్ తో చేస్తున్నానా..? లేకపోతే యంగ్ స్టర్స్ తో చేస్తున్నానా..? అనేది నాకెప్పుడూ ప్రయారిటీ  కాదు. అల్టిమేట్ గా స్క్రిప్ట్ బావుండాలి. అందులో నా క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి…

‘కవచం’ లో నా రోల్…

సినిమాలో నా క్యారెక్టర్ డ్రైవెన్ ఫోర్స్ కాదు. కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. సినిమా మొత్తం కొన్ని క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది.

ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు…

డిఫెరెంట్ స్క్రిప్ట్స్ ఇప్పుడు కాదు, ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ నేనే కొంచెం భయపడేదాన్ని. ఆడియెన్స్ ఆక్సెప్ట్ చేస్తారో లేదో అనే నర్వస్ నెస్ ఉండేది. ఇప్పుడు నేను చాలా మారాను. ధైర్యంగా డిఫెరెంట్ సినిమాలను ఆక్సెప్ట్ చేస్తున్నాను.

అంతగా పట్టించుకోను…

నచ్చితే సినిమా ఆక్సెప్ట్ చేస్తాను. ఆ నచ్చినదాని కోసం ఎంతైనా కష్టపడతాను. ఆ తరవాత సక్సెసా…? ఫెయిల్యూరా  అనేది ఫేట్ కి వదిలేస్తాను. అస్సలు పట్టించుకోను.

అదే సీక్రెట్…

ఇన్ని సినిమాల తరవాత కూడా ఇంకా ఇండస్ట్రీలో అంతే డిమాండింగ్ స్పేస్ లో ఉండగలుగుతున్నానంటే, అది నా  హార్డ్ వర్క్ వల్లే అని నా ఫీలింగ్…

వరల్డ్ లోనే ఫస్ట్ టైమ్…  

‘క్వీన్’ తమిళ రీమేక్ లో నటించినందుకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. మొదట్లో నన్నే 4 లాంగ్వేజెస్ లో నటించమని అప్రోచ్ అయ్యారు. ఆ తరవాత ఒక్కో లాంగ్వేజ్ కి ఒక్కొక్కరు అని ఫిక్సయ్యారు. ఇంత వైడ్ రేంజ్ లో రీమేక్ అనేది వరల్డ్ లోనే ఫస్ట్ టైమ్ జరుగుతుంది నాకు తెలిసి…

టైమ్ కావానుకున్నా…  

ఈ ఇయర్ ఫస్టాఫ్ లో నా ఆరోగ్యం కొంచెం సహకరించలేదు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో చాలా బాధపడ్డాను.  నిజానికి రెస్ట్ తీసుకుందాము, వీలైనంత వరకు సినిమాలు తగ్గించుకుందామనే ఆలోచనలో ఉన్నా. కానీ అలా జరగలేదు. అన్ని అద్భుతమైన సినిమాలే, సూపర్బ్ క్యారెక్టర్స్. 2018 నా కరియర్ లో అమేజింగ్ ఇయర్.

బెల్లంకొండ శ్రీనివాస్…

శ్రీనివాస్ అందరికీ స్వీట్ హార్ట్. చాలా హార్డ్ వర్కర్. ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా శ్రీనివాస్ లాగే ఆలోచిస్తా. ఏదో ఒకటి చేయాలనుకుంటూనే ఉంటాడు. చాలా వైడ్ గా ఆలోచిస్తాడు. తనకంటూ పర్టికులర్ ఐడెంటిటీ ఉండాలనుకుంటాడు.