‘జెర్సీ’ హీరోయిన్ – ఎవరీ శ్రద్ధా శ్రీనాథ్...?

Thursday,March 07,2019 - 10:02 by Z_CLU

నాని  సినిమా అనౌన్స్ చేశాడంటే మ్యాగ్జిమం ఆ సినిమాతో కొత్త హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. సాధారణంగా నాని సినిమాతో లాంచ్ అయితే ఈజీగా స్టార్ హీరోయిన్ అయిపోతారు. కానీ శ్రద్ధా శ్రీనాథ్ మాత్రం ఆల్రెడీ స్టార్ హీరోయిన్ అనిపించుకున్నాకే నాని సినిమాతో తెలుగులో లాంచ్ అవుతుంది.

మలయాళం సినిమాతో కరియర్ బిగిన్ చేసిన శ్రద్ధా, కన్నడ తమిళ భాషల్లో బిజీ హీరోయిన్. అంతెందుకు రీసెంట్ గా సమంతా రీమేక్ చేసిన కన్నడ సూపర్ హిట్ సినిమా ‘యూటర్న్’ శ్రద్ధా శ్రీనాథ్ దే. గతంలో రిలీజైన తమిళ బ్లాక్ బస్టర్ ‘విక్రమ్ వేద’ లోను హీరోయిన్ గా నటించింది శ్రద్ధా శ్రీనాథ్. ఇప్పుడు  హిందీ సెన్సేషనల్ హిట్  ‘పింక్’, తమిళ రీమేక్ ‘నేర్కొండ పార్వై’ లోను కీ రోల్ ప్లే చేస్తుంది. బోణీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

2019 లో కరియర్ గ్రాఫ్ ని మరింత వైడ్ గా ప్లాన్ చేసుకుంటున్న శ్రద్ధా శ్రీనాథ్, ఈ ఏడాది ‘జెర్సీ’ తో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతూనే మరోవైపు ‘మిలాన్ టాకీస్’ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అవుతుంది.

నాని కరియర్ లోనే చాలా ప్రెస్టీజియస్ సినిమాగా తెరకెక్కుతుంది ‘జెర్సీ’. సెట్స్ పైకి రాకముందు నుండే ఈ సినిమాని చాలా స్పెషల్ గా ట్రీట్ చేశాడు. బ్యాట్స్ మ్యాన్ గా ట్రైనింగ్ తీసుకుని మరీ సినిమా స్టార్ట్ చేశాడు. అలాంటి సినిమాలో నాని లవ్ ఇంట్రెస్ట్ గా నటించింది శ్రద్దా శ్రీనాథ్. ఎగ్జాక్ట్ గా క్యారెక్టర్ పెద్దగా రివీల్ కాలేదు కానీ సినిమాలో పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనుందని తెలుస్తుంది.