అటు వెంకీ ఇటు చిరు – ఎవరు ముందు...?

Thursday,March 07,2019 - 11:02 by Z_CLU

ఇప్పుడు బన్నితో సినిమాకి రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది. బన్ని లుక్స్ ప్రిపరేషన్ వగైరా లాంటి చిన్న చిన్న పనులు చేతికందగానే రేపో, మాపో సెట్స్ పైకి వచ్చేస్తుందీ కాంబో. ఈ సినిమా తరవాత మరో 2 సినిమాలు రెడీగా లైనప్ చేసుకున్నాడు త్రివిక్రమ్. ఈ సారి సీనియర్ హీరోలను డైరెక్ట్ చేయబోతున్నాడు.

‘అరవింద సమేత’ రిలీజ్ కి… బన్నితో చేసిన కొత్త సినిమా స్క్రిప్ట్ డిస్కర్షన్స్ కి మధ్య దొరికిన కాస్తంత గ్యాప్ లో, ఏకంగా ఇద్దరు సీనియర్ హీరోలు చిరు, వెంకీని కన్విన్స్ చేసుకున్నాడు ఈ మాటల మాంత్రికుడు. స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ చేసుకున్నాడో తెలీదు, అసలు వాళ్ళు ఉన్నపళంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే రేంజ్ లో వాళ్ళు చెప్పిన స్టోరీ లైన్స్ ఏంటనేది ఇప్పట్లో బయటపడే విషయాలు కావు కానీ, ఇప్పుడున్న ప్రశ్నల్లా… వెంకీ ముందా..? చిరు ముందా..?

‘సైరా’ కంప్లీట్ అవ్వడానికి ఇంకొంచెం టైమ్ పట్టేలా ఉంది. అది కంప్లీట్ అయినా ముందే కమిట్ అయ్యాడు కాబట్టి మ్యాగ్జిమం కొరటాల సినిమాతోనే సెట్స్ పైకి వస్తాడు చిరు. కాబట్టి కొద్దో గొప్పో త్రివిక్రమ్ కి అందుబాటులో ఉండేది వెంకీనే. కానీ ఇప్పటికే ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటున్న ‘వెంకీ మామా’ కంప్లీట్ అయ్యే నాటికీ,  త్రివిక్రమ్ కూడా బన్ని సినిమాకి ప్యాకప్ చెప్పేసి రెడీగా ఉండాలి. అది జరిగేనా..?

బన్ని సినిమా ఇంకా సెట్స్ పైకి రానేలేదు. కాబట్టి ఏ రకంగా లెక్క మ్యాచ్ కాదు. సరే వెంకీ, త్రివిక్రమ్ కోసం కొంచెం వెయిట్ చేద్దామనుకున్నా, ఆల్రెడీ అనిల్ రావిపూడి కథ చెప్పి కన్విన్స్ చేసుకుని ఉన్నాడు కాబట్టి, ‘సినిమా చేసేద్దాం సర్…’ ఒక్క మాట అనేసినా వెంకీ ఆగడం కష్టం అప్పుడు న్యాచురల్ గానే త్రివిక్రమ్ కి గ్యాప్ వచ్చేస్తుంది.

కాబట్టి త్రివిక్రమ్ ఈ సినిమా ప్లాన్స్ ని తన డైరీలో ఎలా రాసి పెట్టుకున్నాడో తెలీదు కానీ, ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబోల విషయంలో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.