నాని జెర్సీ – ఫస్ట్ టైమ్ అనుభవాలు

Thursday,April 11,2019 - 11:02 by Z_CLU

‘జెర్సీ’ సినిమా నాని కరియర్ లోనే కాదు టాలీవుడ్ కే స్పెషల్ మూవీ కాబోతుంది. ఎందుకంటే టాలీవుడ్ లో ఇప్పటి వరకు బెస్ట్ మూవీస్ వచ్చాయి అందులో అస్సలు అనుమానం లేదు. కానీ ‘జెర్సీ’ మాత్రం డెఫ్ఫినెట్ గా సమ్ థింగ్ స్పెషలే. ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ని రీసెంట్ సినిమాల్లో చూడలేదు ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి…

ఫస్ట్ టైమ్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ : క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వచ్చాయేమో కానీ, పర్టికులర్ గా ఒక క్రికెటర్ స్ట్రగుల్ ని కీ పాయింట్ గా తీసుకున్న సినిమా అయితే ఇప్పటి వరకు రాలేదు. దానికోసం ఎక్కడా న్యాచురాలిటీ దెబ్బ తినకుండా, 1986, 1996, 2018 టైమ్ ఫ్రేమ్స్ తో కథను నడిపిస్తూ, ప్రెజెంట్ జెనెరేషన్ కి కనెక్ట్ చేయడం అనేది తెలుగు సినిమాకి కొత్తే.

ఫస్ట్  టైమ్ శ్రద్ధా శ్రీనాథ్ : ఈ సినిమాతోనే శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన విజువల్స్ ని బట్టి న్యాచురల్ స్టార్ కి తగ్గ స్క్రీన్ పార్ట్ నర్ అనిపిస్తుంది.

ఫస్ట్ టైమ్ గౌతమ్ తిన్ననూరి : నాని మామూలుగా అపుడప్పుడు డైరెక్టర్స్ ని రిపీట్ చేస్తుంటాడు. కానీ గౌతమ్ తిన్ననూరితో ఫస్ట్ టైమ్. ఇక్కడ మెన్షన్ చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే, గౌతమ్ కి ఇది రెండో సినిమా కానీ, రాసుకున్న మొదటి కథ మాత్రం ఇదే.  

ఫస్ట్ టైమ్ క్రికెట్ మ్యాచ్ : క్రికెట్ గురించి ఇంత డీటేల్డ్ సినిమా తెలుగులో ఫస్ట్ టైమ్. కొన్ని సందర్భాల్లో సినిమా చూస్తుంటే క్రికెట్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆడియెన్స్ కి ఇలాంటి అనుభవం ఫస్ట్ టైమ్.

ఫస్ట్ టైమ్అనిరుద్ : నాని, అనిరుద్ ల కాంబినేషన్ ఫస్ట్ టైమ్. ఆ ఫ్రెష్ నెస్ ఇప్పటికే రిలీజైన సాంగ్స్ లో తెలుస్తుంది. ప్రతి సాంగ్ కి మ్యూజిక్ లవర్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడాన్ని బట్టి చూస్తే, అనిరుద్ సినిమా BGM లో కూడా ఏదో మ్యాజిక్ చేసే ఉంటాడని అంచనా.

ఫస్ట్ టైమ్ఇది నాని అనుభవం : సాధారణంగా సినిమా షూటింగ్ అయిపోతే టీమ్ ని మిస్సవుతారు. అన్నాళ్ళు కలిసి పని చేస్తాం కాబట్టి లాస్ట్ డే అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ జెర్సీ లాస్ట్ డే రోజు, అర్జున్ ని మిస్సయ్యానని ఫీలయ్యాడు. అలా నటించిన క్యారెక్టర్ ని మిస్సవ్వడం నాని కరియర్ లోనే ఫస్ట్ టైమ్. ఈ విషయాన్ని స్వయంగా నాని షేర్ చేసుకున్నాడు. సినిమా చూశాక ఆడియెన్స్ కూడా అలాగే ఫీలయ్యే అవకాశాలున్నాయి.