అదే నాని గొప్పతనం – శ్రద్ధా శ్రీనాథ్

Thursday,April 11,2019 - 03:02 by Z_CLU

నాని సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ శ్రద్ధా శ్రీనాథ్ కి మాత్రం వాళ్ళతో కంపేర్ చేస్తే కాస్తంత ఎక్కువగా కలిసొచ్చిందని చెప్పాలి. ‘జెర్సీ’ సినిమా క్రియేట్ చేస్తున్న వైబ్స్ చూస్తుంటే, సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రద్దా శ్రీనాథ్ తన టాలీవుడ్ డెబ్యూ గురించి చెప్పుకుంటూనే, నానితో షేర్ చేసుకున్న ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ ని షేర్ చేసుకుంది.

నిజానికి శ్రద్ధా శ్రీనాథ్ డెబ్యూ ‘జెర్సీ’ తో కాకుండా ఇంకో సినిమాతో జరిగి ఉండేది. జెర్సీ కన్నా ముందే ‘క్షణం’ సినిమా దర్శకుడు రవికాంత్ పేరేపు కొత్త సినిమా కోసం ఆల్రెడీ సంతకం చేసేసింది శ్రద్దా శ్రీనాథ్. మరోవైపు  ఆది సాయికుమార్ సినిమా ‘జోడీ’ లో కూడా  నటిస్తుంది. అయితే ఈ 2 సినిమాల తరవాత సంతకం చేసిన ‘జెర్సీ’ ముందుగా రిలీజవుతుందని తన ఎగ్జైట్ మెంట్ ని షేర్ చేసుకుంది శ్రద్ధా శ్రీనాథ్.

ఇక నాని విషయానికి వస్తే తనతో అసలేదీ చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదు, ఇట్టే పసి గట్టేస్తాడు అని చెప్పుకుంది శ్రద్ధా శ్రీనాథ్. కాస్త డీటేల్డ్ గా చెప్పమని అడిగితే ఒక ఇన్సిడెంట్ ని షేర్ చేసుకుంది. అందరూ హీరోయిన్స్ లాగే శ్రద్ధా కూడా స్ట్రిక్ట్ డైట్ ని ఫాలో అవుతుంది. ఇది తినకూడదు అని రూల్ పెడితే, ఎట్టి పరిస్థితుల్లో వాటికి దూరంగానే ఉంటుందట. అయితే ఒకసారి ఆల్మోస్ట్ శ్రద్ధా డైట్ ఇరకాటంలో పడే పరిస్థితి వచ్చిందట.

‘జెర్సీ’ సినిమాలో ఒకచోట బర్త్ డే సీక్వెన్స్ వస్తుందట. అప్పుడు సీన్ లో కేక్ కట్ చేయడం లాంటివి ఉంటాయట. అయితే కనీసం షాట్ కోసమైనా కేక్ తినాల్సి వస్తుందేమోనని లోపల్లోపలే కంగారు పడిపోయిందట శ్రద్ధా. అప్పుడు కనీసం శ్రద్ధా నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పకుండానే ‘నువ్వు తినాల్సిన అవసరం లేదులే..’ అని నాని చెప్పాడట. అంతగా మనం చెప్పకుండానే మన ఇబ్బందుల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకుంటాడు నాని అని చెప్పుకుంది శ్రద్ధా శ్రీనాథ్.