శ్రద్ధా శ్రీనాథ్ ఇంటర్వ్యూ

Monday,April 15,2019 - 02:16 by Z_CLU

‘జెర్సీ’ తో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతుంది శ్రద్ధా శ్రీనాథ్. కానీ ఇప్పటికే ట్రైలర్ తో… స్టిల్స్ తో అందరికీ కనెక్టయిపోయింది. జస్ట్ రెగ్యులర్ హీరోయిన్ లా కాదు, మనం రెగ్యులర్ గా చూసే ఓ రియల్ క్యారెక్టర్ లో నటించింది శ్రద్ధా ‘జెర్సీ’ లో. ‘ఈ సినిమాని ఎందుకు ఒప్పుకున్నావ్’ అని అడిగితే నవ్వేస్తూ… ‘ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రాదు అందుకే’.. అని టక్కన సమాధానం చెప్పేసింది. ఇంతేనా…. ఈ సినిమా గురించి ఇంకెన్నో చెప్పుకుంది… వరసగా చదివేయండి…

అంతా కలిపి ఆరేళ్ళు…

నాకు హైదరాబాద్ కొత్త కాదు. ఇక్కడే సికింద్రాబాద్ లో ఉండేవాళ్ళం… 7th నుండి 12th వరకు. ఇప్పటికీ కొన్ని కొన్ని గుర్తున్నాయి. అందుకే నాకు తెలుగు మరీ కొత్త కాదు .. మాది బేసిగ్గా బెంగళూరు. పుట్టిందేమో కాశ్మీర్ లో … 9 స్కూల్స్ చేంజ్ అయ్యాం. నాన్నా ఆర్మీ ఆఫీసర్ కాబట్టి ప్రతి రెండేళ్లకోసారి షిఫ్ట్ అవుతూనే ఉండేవాళ్ళం…

జెర్సీ కి ముందు…

‘జెర్సీ’ చేయకముందు నుండే ఈ సినిమాపై చాలా నమ్మకముంది. ఇప్పుడైతే ట్రైలర్, దానికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఇంకా నమ్మకం పెరిగిపోయింది.

ఇప్పటికే 2 సినిమాలు…

రవికాంత్ పెరేపు డైరెక్షన్ లో నటిస్తున్నాను. ఈ సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ  సినిమా తెరకెక్కుతుంది. ‘జోడీ’ లో చేస్తున్నాను ఆది సాయి కుమార్. ఈ 2 సినిమాలు 2017 లో సంతకం చేశాను. జెర్సీ 2018 లో.. లక్కీగా ‘జెర్సీ’ ఫస్ట్ రిలీజవుతుంది.

అలా అనుకుంటున్నా…

నాకు తెలిసి నేను ఇంతకు ముందు చేసిన కన్నడ, తమిళ సినిమాలు చూసి, నాకీ ఆఫర్ ఇచ్చారనుకుంటా. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు మెసేజ్ పెట్టారు. ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేయమని. నేను మాట్లాడినప్పుడు నాని తో సినిమా అని చెప్పి, సినాప్సిస్ పంపించారు. నాకు నచ్చేసింది, ఆ తర్వాత గౌతమ్ బెంగళూరు వచ్చి న్యారేట్ చేశారు. గ్రిప్పింగ్ ఎమోషన్స్… సినిమాకి నో చెప్పలేకపోయా.

జస్ట్ కథే కాదు….

నేను డెఫ్ఫినెట్ గా కథకి ఇంపార్టెన్స్ ఇస్తాను. అదే ఫస్ట్ ప్రయారిటీ. కానీ దాంతో పాటు సినిమాలో నా క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది కూడా చూసుకుంటాను.

అది చాలా అవసరం…

ఒక మంచి సినిమా బయటికి రావాలంటే టెక్నీషియన్స్ పై కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. గౌతమ్ కథ చెప్పాక, ఆ డీటేల్స్ కూడా చెప్పేశాడు. ఏయే క్రాఫ్ట్ ఎవరెవరు హ్యాండిల్ చేస్తున్నారో చెప్పాక, ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అదే రోజు అంచనా వేశా…

నటిగా అవి నా స్టాండర్డ్స్…

నటించడం నాకు కొత్త కాదు. నా పర్ఫామెన్స్, నా కేపబిలీటీస్ పై నాకెప్పుడూ అనుమానం లేదు. జెర్సీ చేసేటప్పుడు నాకున్న సమస్యల్లా లాంగ్వేజ్. అప్పుడు నాని చాలా సపోర్ట్ చేశాడు. పర్టికులర్ గా కొన్ని ఎమోషన్ సీక్వెన్సెస్ లో ఇది నీ సీన్ అని ఎంకరేజ్ చేసేవాడు.

ఆ వేరియేషన్స్ అమేజింగ్…

1986 లో లవ్ కపుల్ అంటే చాలా పెద్ద విషయం. ఇప్పుడున్నంత ఫ్రీడమ్ అప్పుడు ఉండేది కాదు.  ఆ వేరియేషన్ సినిమాలో క్లియర్ గా చూపించాం. దానికి తోడు నా రోల్ లుక్స్ వచ్చేసరికి కేథలిక్ అమ్మాయి. సో లుక్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాం. ఆ తర్వాత ఫేజ్ లో రియాలిటీ… రిలేషన్ షిప్స్… జస్ట్ లవ్ లో ఉన్నపుడు ఉండేలా ఉండదు. ఆ వేరియేషన్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది.

ఫస్ట్ సినిమాలో తల్లిగా…

డెబ్యూ సినిమాలోనే తల్లిగా కనిపించాలి అన్నప్పుడు ఆలోచించా. ఎందుకంటే మనల్ని ఒకలా చూసి ఇష్టపడితే, ఆ ఇమేజ్ ఫిక్సయిపోతుంది. ఇది రిస్కీ అనిపించినా, ఇలాంటి సినిమాలో నటించే అవకాశం అంత ఈజీగా రాదు. అందుకే రిస్కైనా చేసేద్దామనుకున్నా. అయినా సినిమా బిగినింగ్ లో యంగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లమ్  అనుకుంటున్నా.

జెర్సీ హానెస్ట్ ఎమోషన్స్…

‘జెర్సీ’ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో హానెస్ట్ ఎమోషన్స్ చూస్తారు…

విష్ లిస్టులో డైరెక్టర్స్…

రాజమౌళి, త్రివిక్రమ్ గారు… తరుణ్ భాస్కర్ నా విష్ లిస్టు లో టాప్ ప్లేస్ లో ఉంటారు. ఇక మణిరత్నం గారి సినిమాలో కూడా, ఇంకెన్ని సార్లు అవకాశం వచ్చినా చేస్తూనే ఉంటా. మద్రాస్ టాకీస్ బ్యానర్ లో పేరు పడటం అనేది అదృష్టంగా ఫీలవుతా.

‘జెర్సీ’ లో నాకు నచ్చింది…

జెర్సీలో నాకు నచ్చినది ఆఫ్టర్ మ్యారేజ్ ఫేజ్. డిఫెరెంట్ షేడ్ ఉన్న క్యారెక్టర్. తన భర్తంటే చాలా ఇష్టం. కానీ తను జాబ్ చేయకపోవడం కూడా తనకు పెద్ద ప్రాబ్లమ్. అలాగని చెప్పి తన కొడుకు ముందు అస్తమానం భర్తను అనదు, అలాగని అనకుండా ఉండదు… బ్యాలన్స్డ్ గా ఉంటుంది. ఇరిటేటెడ్ గా ఉంటుంది… లవబుల్ గా ఉంటుంది.. అన్నీ కలిసిన క్యారెక్టర్… సో నాకు అదే ఇష్టం..

నా ఫేవరేట్ క్రికెటర్…

రాహుల్ ద్రావిడ్ ఓన్లీ.. ఇంకెవ్వరూ కాదు… చిన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూస్ చదివేదాన్ని. అందరూ ఆయన్ని జెంటిల్ మెన్ అనే వాళ్ళు. అలా మైండ్ లో ఉండిపోయింది. క్రికెటర్ గా కన్నా హ్యూమన్ బీన్ గా  ఆయనంటే చాలా ఇష్టం.

ఒక్క భాష తప్ప…

తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీ.. డిఫెరెన్స్ అంటూ ఏమీ ఉండదు. మహా ఆయితే ఒక్క లాంగ్వేజ్ తప్ప. అక్కడ డైరక్టర్స్ యాక్షనే చెప్తారు.. ఇక్కడా అంతే… టెక్నికాలిటీస్ దగ్గరి నుండి క్వాలిటీ వరకు అందరికీ ఒకేరకం ఆలోచన ఉంటుంది.

‘జెర్సీ’ నేర్పిన పాఠం…

సిచ్యువేషన్ ఎలాంటిదైనా పార్ట్ నర్ ని నమ్మాలనేది ‘జెర్సీ’ నాకు నేర్పింది.

అలా జరిగింది…

2015 కి ముందు నేను లాయర్ ని. రెండేళ్ళు రియల్ ఎస్టేట్ లాయర్ గా ప్రాక్టీస్ చేశాను. కానీ నిజంగా హ్యాపీగా లేను. కాలేజ్ డేస్ నుండే థియేటర్స్ కి ఎట్రాక్ట్ అయ్యాను. రిహార్సల్స్ అంటే ఇష్టం.. డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం అంటే ఇష్టం. ఒకసారి 2015 జనవరి లో కన్నడ ఇండిపెండెంట్ ఫిల్మ్ లో అవకాశం వచ్చింది… అంతే మార్చి నుండి ఫుల్ టైమ్  యాక్టర్ గా ఫోకస్ పెట్టాను. ‘యూ టర్న్’ లో కన్నడ హీరోయిన్ గా నా డెబ్యూ మూవీ.

అదే రియల్ నాని…

అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా చాలా తగ్గి ఉంటాడు. నేనో స్టార్ ని అన్న ఫీలింగ్ అస్సలు ఉండదు. పర్ఫామెన్స్  వరకు వచ్చేసరికి ఏదైనా నానితో డిస్కస్ చేయవచ్చు. సాధారణంగా స్టార్స్ షాట్ అయిపోగానే క్యారీ వాన్ లోకి వెళ్ళిపోతారు. కానీ నాని అలా కాదు. ఓ చేర్ లాక్కుని అక్కడే కూర్చుంటాడు..