జూలై లో జవాన్ కి ప్యాకప్

Monday,July 17,2017 - 05:32 by Z_CLU

సాయి ధరం తేజ్ ‘జవాన్’ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. ప్రస్తుతం సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉన్న సినిమా యూనిట్ జూలై లాస్ట్ వీక్ కల్లా షూటింగ్ కి ప్యాకప్ చెప్పేయనుంది. సెప్టెంబర్ 1 న రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న ఈ సినిమా ఆల్ రెడీ డబ్బింగ్ పనులను బిగిన్ చేసేసింది.

అల్టిమేట్ ఫ్యామిలీ  అండ్ యాక్షన్  ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. S.S. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి B.V.S రవి డైరెక్టర్. కృష్ణ నిర్మాత.