డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా ఇస్మార్ట్ శంకర్

Monday,July 22,2019 - 11:25 by Z_CLU

రామ్-పూరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతుంది. ఓ పక్కా మాస్ మూవీ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూసిన ఆడియన్స్, ఇస్మార్ట్ శంకర్ తో పండగ చేసుకుంటున్నారు. అలా విడుదలైన మొదటి రోజు నుంచి రికార్డు వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా 3 రోజులకే బ్రేక్ ఈవెన్ అయింది. ఇప్పుడీ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

నిన్నటితో ఫస్ట్ వీకెండ్ (4 రోజులు) పూర్తిచేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా 24 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అలా ఫస్ట్ వీకెండ్ నాటికే ఈ సినిమా 140శాతం రికవర్ అయింది.

సో.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే.. ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలున్నాయి. మరో 3 రోజుల్లో సినిమాకు ఓవర్ ఫ్లోస్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాధ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు.