వెంకటేష్ క్లాప్ తో ప్రారంభమైన '22'

Monday,July 22,2019 - 11:59 by Z_CLU

రూపేష్ కుమార్ హీరోగా శివ కుమార్ .బి దర్శకత్వంలో తెరకెక్కనున్న ’22’ సినిమా విక్టరీ వెంకటేష్ క్లాప్ తో గ్రాండ్ గా లాంచ్ అయింది. మా ఆయి బ్యానర్ పై సుశీల నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 29 నుండి మొదలుకానుంది.

“సినిమాకు ’22’  టైటిల్ పెట్టడానికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉందని…  టైటిల్ డిజైనింగ్ బట్టే సినిమా కథ తెలుసుకోవచ్చని, త్వరలోనే  ఓ సందర్భం చూసి టైటిల్ లోగోను విడుదల చేస్తామని” దర్శకుడు శివ తెలిపాడు.

మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ‘ఫలక్ నుమా దాస్’ ఫేం సలోని మిశ్ర హీరోయిన్ గా నటిస్తుంది. సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్నాడు.