టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ టైటిల్స్

Wednesday,June 07,2017 - 06:30 by Z_CLU

ఫిలిం చాంబర్ లో సరికొత్త టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి. వీటిలో కొన్ని ఇంకా ప్రీ-ప్రొడక్షన్స్ స్టేజ్ లో ఉంటే, మరికొన్ని కాల్షీట్ల కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ప్రస్తుతం  టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తున్న టైటిల్స్ ఇవే…

సంపూర్ణ రామాయణం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రీసెంట్ గా అనౌన్స్ అయిన సినిమా. బాహుబలి రేంజ్ లో హై ఎండ్ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా డైరెక్టర్, లీడ్ కాస్ట్ లాంటి వివరాలు ఇంకా బయటికి రాలేదు కానీ, నిన్నమొన్నటి వరకు సోషల్ మీడియాలో ఈ సినిమాకి రామ్ చరణే రైట్ చాయిస్ లాంటి కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి. ఈ సినిమాకు సంబంధించి సంపూర్ణ రామాయణం అనే టైటిల్ ను రిజిస్టర్ చేసింది గీతా ఆర్ట్స్. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతోంది సంపూర్ణ రామాయణం.

సహోదరా : ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించింది వారాహి బ్యానర్. కుదిరితే రాజమౌళితో చేయబోయే సినిమా కోసం ఈ టైటిల్ ను ఉపయోగించాలని ఆ సంస్థ భావిస్తోందట. వారాహి అధినేత సాయికొర్రపాటితో సినిమా చేయడం తనకు ఎంతో ఇష్టమని రాజమౌళి ఇప్పటికే ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

సీతారామ కళ్యాణం : గతంలో నాగచైతన్యతో ప్రేమమ్ లాంటి హిట్ సినిమాని నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ టైటిల్ రిజిస్టర్ అయింది. ప్రస్తుతం కొంతమంది యంగ్ హీరోస్ తో  ఈ బ్యానర్ చర్చలు జరుపుతోంది. ఏ హీరోకు ఈ టైటిల్ ఫిక్స్ అవుతుందో చూడాలి.

భళి భళి భళి భళి రా భళి : ఏదైనా పాట సూపర్ హిట్టయిందంటే అది సినిమా టైటిల్ గా మారాల్సిందే. బాహుబలి 2 లోని సూపర్ హిట్ సాంగ్ ‘భళి భళి భళి భళి రా భళి’ టైటిల్ కూడా ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ అయింది.

శ్రీనివాస కళ్యాణం : బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నిర్మిస్తూ బిజీ బిజీగా ఉన్న బ్రాండెడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిజిస్టర్ చేసిన టైటిల్ ఇది. శ్రీనివాస కళ్యాణం – శ్రీ వెడ్స్ నివాస్ దాని ట్యాగ్ లైన్. గతంలో ‘శతమానం భవతి’ లాంటి సూపర్ హిట్ సినిమాకి దర్శకత్వం వహించిన ‘సతీష్ వేగేశ్న’ ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమాకి ఇంకా హీరో ఫిక్స్ కాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా అప్పుడే టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.

శివ సన్నాఫ్ సీతాలక్ష్మి : ఎగ్జాక్ట్ గా ఎవరి కోసం రెడీ అయిన సబ్జెక్టో ఇంకా బయటికి రాలేదు కానీ, లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ టైటిల్ రిజిస్టర్ అయింది. కాస్త డెప్త్ కి వెళ్తే ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్న సినిమా యూనిట్, రేపో మాపో ఇంటరెస్టింగ్ అప్ డేట్స్ తో అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసే చాన్సెస్ కనిపిస్తున్నాయి.